ఫీచర్ ఫిలింగా జాతీయ అవార్డు కు ఎన్నికైన 'ఎఫ్ 2' ..!

గత సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి భారీ విజయం సాధించిన సినిమా ఎఫ్2. విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్నిఅందుకుంది.ఈ సినిమాకి అనిల్ రావిపూడి డైరెక్షన్ చేశారు.ఇక ఈ సినిమాలో హీరోల సరసన తమన్నా భాటియా, మెహరీన్ కౌర్ హీరోయిన్లుగా నటించారు.ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకొని విడుదల చేసిన ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసింది.దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించింది.

 F 2 Nominated For National Award For Feature Filming F2 Movie, Venkatesh, Varun-TeluguStop.com

ఇక అసలు విషయంలోకి వెళితే… తాజాగా ఈ సినిమా ఓ అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది.అదేమిటంటే.

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వివిధ భాషల్లో సినిమాలకు అవార్డులను ప్రకటించింది.51వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో భాగంగా తాజాగా ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో తెలుగుకు సంబంధించి ఎఫ్ 2 సినిమాకి జాతీయ అవార్డు లభించింది.మొట్టమొదటిసారి ఈ అవార్డు సాధించిన తెలుగు సినిమాగా నిలవడం నిజంగా గర్వకారణమే.

ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ తో తెరకెక్కిన ఈ సినిమా కుటుంబ సమేతంగా అందరూ ఎంజాయ్ చేసేలా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు.

ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మంచి పాటలను సమకూర్చారు.ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.అయితే ఎఫ్2 సినిమాకు ప్రస్తుతం అనిల్ రావిపూడి సీక్వెల్ గా ఎఫ్3 సినిమాను కూడా ప్లాన్ సిద్ధం చేసేశారు.చూడాలి మరి ఎంత త్వరలో ఈ సినిమా పట్టాలు ఎక్కనుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube