'ఎఫ్‌ 2' డైరెక్టర్‌ ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నాడేంటీ?

సంక్రాంతి కానుకగా ‘ఎఫ్‌ 2’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.సంక్రాంతి కానుకగా బరిలోకి దిగిన ‘వినయ విధేయ రామ’, ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘పేట’ చిత్రాలను తలదన్ని ఎఫ్‌ 2 చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది.

 F2 Movie Director Anil Ravipudi Next Movie-TeluguStop.com

దాదాపుగా 100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించిన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కూడా లాభాలతో మూడవ వారంలో కూడా దూసుకు పోతుంది.ఎఫ్‌ 2 చిత్రంతో దర్శకుడు అనీల్‌ రావిపూడి స్థాయి అమాంతం పెరిగింది.

ఈయన దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు నిర్మాతలు మరియు హీరోలు చాలా ఆసక్తిని కనబర్చుతున్నారు.

అనీల్‌ రావిపూడి తదుపరి చిత్రం బాలకృష్ణతో ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం బాలయ్య ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ఆ తర్వాత బాలయ్య చేయబోతున్న సినిమాకు అనీల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తాడని అంతా భావిస్తున్నారు.

అయితే బాలయ్య ఎన్టీఆర్‌ మహానాయకుడు చిత్రం తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకునే అవకాశం ఉంది.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బాలయ్య మరోసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకు నియోజక వర్గంకు సమయం కేటాయించబోతున్నాడు.

బాలకృష్ణతో మూవీకి సమయం పట్టే అవకాశం ఉంది.అందుకే ఈ గ్యాప్‌లో అనీల్‌ రావిపూడి మరో సినిమాను కమిట్‌ అయ్యాడు.అయితే ఆశ్చర్యకరంగా అనీల్‌ రావిపూడి తర్వాత సినిమా లేడీ ఓరియంటెడ్‌ చిత్రం అంటూ సమాచారం అందుతోంది.ప్రముఖ నిర్మాత ఒకరు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌తో అనీల్‌ రావిపూడి ఈ చిత్రంను చేసే అవకాశం ఉందని టాక్‌ వినిపిస్తుంది.త్వరలోనే ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube