రాజమౌళి సినిమాను క్రాస్‌ చేసిన 'ఎఫ్‌ 2'.... వామ్మో ఏంటీ ఈ కలెక్షన్స్‌  

  • సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వినయ విధేయ రామ’, ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘ఎఫ్‌ 2’ చిత్రాల్లో విజేత ఎవరో ఇప్పటికే తేలిపోయింది. విడుదలైన వారం రెండు వారాలకే వినయ విధేయ రామ మరియు ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రాలు జాడా పత్తా లేకుండా పోయాయి. ఇక ఎఫ్‌ 2 చిత్రం ఇంకా కూడా థియేటర్లలో ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ చిత్రం ఓవర్సీస్‌లో కూడా దుమ్ము రేపుతూ వసూళ్లు సాధిస్తుంది. దాదాపు మూడు వారాలు దాటినా కూడా ఈ చిత్రం ఇంకా వసూళ్లను ఈ స్థాయిలో రాబడుతూ ప్రేక్షకులనే కాకుండా ట్రేడ్‌ వర్గాలను కూడా అవాక్కయ్యేలా చేస్తుంది.

  • F2 Movie Collections Crosses Rajamouli Big Blasters-Telugu Top Tollywood Ten Varun Tej Venkatesh

    F2 Movie Collections Crosses Rajamouli Big Blasters

  • ప్రస్తుతం ఈ చిత్రం గ్రాస్‌ కలెక్షన్స్‌ ఇంకా కూడా బాగా వస్తున్నాయని, ప్రతి రోజు కూడా అన్ని ఏరియాల నుండి 50 లక్షల వరకు షేర్‌ వస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. ఇక ఈ చిత్రం ఇప్పటికే 80 కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేసింది. దాంతో ఈ చిత్రం టాలీవుడ్‌ టాప్‌ 10 చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఇప్పటికే మగధీర రికార్డును బ్రేక్‌ చేసిన ఎఫ్‌ 2 చిత్రం మెల్ల మెల్లగా టాప్‌ 5 జాబితాలో చేరబోతుంది. మరో 15 కోట్లు వసూళ్లు సాధిస్తే టాప్‌ 5లో స్థానం ఖాయంగా కనిపిస్తుంది. ఈ స్థాయిలో వసూళ్లు వస్తున్న నేపథ్యంలో దిల్‌రాజు సినిమాకు ఇంకా పబ్లిసిటీ భారీగా చేస్తున్నాడు.

  • F2 Movie Collections Crosses Rajamouli Big Blasters-Telugu Top Tollywood Ten Varun Tej Venkatesh
  • ఎప్‌ 2 చిత్రంలో వెంకటేష్‌ అద్బుతమైన కామెడీని పండించిన విషయం తెల్సిందే. వెంకీకి ఏమాత్రం తగ్గకుండా వరుణ్‌ కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి ట్యాలెంట్‌ను పూర్తిగా వాడేసుకున్న అనీల్‌ రావిపూడి ఎఫ్‌ 2 అంటూ డబుల్‌ ఫన్‌ను ఇచ్చాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌ వస్తుందని అంటున్నారు. ఎఫ్‌ 3 అంటూ ఇప్పటికే టైటిల్‌ కూడా ఖరారు అయ్యింది. 2021లో సంక్రాంతి కానుకగా ఎఫ్‌ 3ని విడుదల చేస్తానంటూ దిల్‌రాజు ఇప్పటికే ప్రకటించాడు. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయన్నాడు. ఇక వెంకీ, వరుణ్‌ లతో పాటు ఈ చిత్రంలో రవితేజ కూడా ఉంటాడనే వార్తలు వస్తున్నాయి.