ఎఫ్ 2తో మరో సారి వెంకి బాలీవుడ్ లో రచ్చ  

F2 Movie Bollywood Remake-

అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందికి వచ్చి వంద కోట్ల కలెక్షన్ ని సొంతం చేసుకుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఊహించని స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ అయిపోయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఇక వెంకటేష్ ని కూడా చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులు మరో సారి ఫ్యామిలీ హీరోగా చూసి ఎంజాయ్ చేసారు.

F2 Movie Bollywood Remake-

ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ అంటే వెంకటేష్ కి తిరుగులేదని ఈ సినిమా మరోసారి రుజువు చేసింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాని దిల్ రాజు, బోనీ కపూర్ తో కలిసి బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు.

ఇక ఈ సినిమా కోసం హీరోలు ఎవరిని తీసుకుంటారు అనే విషయానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేసాడు.ఇందులో మొత్తం నటీనటులు అందరూ వాళ్ళే ఉంటారని, అలాగే వెంకటేష్ కూడా నటిస్తాడని చెప్పుకొచ్చారు.


అయితే వరుణ్ తేజ్ ప్లేస్ లో అర్జున్ కపూర్ ని తీసుకుంటున్నామని, అతని పాత్రలో కొద్దిగా మార్పులు చేసి కథనంలో ఎలాంటి మార్పులు లేకుండా తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు.వెంకటేష్ ఇప్పటికే బాలీవుడ్ లో చంటి, అలాగే యమలీల సినిమాల రీమేక్ లలో నటించి అక్కడి ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాడు.

ఈ నేపధ్యంలో మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి ఎఫ్ 2తో సండది చేయడానికి రెడీ అయిపోతున్నాడు.

తాజా వార్తలు