వెంకీ, వరుణ్ కాంబినేషన్ లో వచ్చిన 'ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) హిట్టా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!!!     2019-01-12   08:12:16  IST  Sai Mallula

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ మల్టి స్టారర్ చిత్రం “ఎఫ్2” (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్. అనిల్ రవి పూడి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. మొదటి నుండే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే అందరిని అమితంగా ఆకట్టుకోవడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో తెలుగుస్టాప్ సమీక్షలో చూసేద్దాం.

Cast and Crew:
న‌టీన‌టులు: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: అనిల్ రవి పూడి
నిర్మాత‌: దిల్ రాజు
సంగీతం:దేవి శ్రీ ప్రసాద్

F2 Fun And Frustration Movie Review-F2 Review First Day Talk Telugu Varun Tej Venkatesh

F2 Fun And Frustration Movie Review

కథ :
హారిక (తమన్నా), హనీ (మెహ్రీన్) ఇద్దరు సిస్టర్స్. వెంకీ ఒక ఎం.ఎల్.ఏ దగ్గర పీ.ఏ గా చేస్తుంటాడు. హారిక, వెంకీలు పెద్దలు పెళ్లి చేస్తారు. వరుణ్ కి హనీ అంటే ఎంతో ఇష్టం. వారిద్దరికీ నిశ్చితార్తం జరుగుతుంది. పెళ్లి తర్వాత వెంకీ జీవితం మొత్తం తారుమారు అవుతుంది. హారిక తన తల్లితో కలిసి వెంకీపై పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. వరుణ్ కి ఈ ఫామిలీతో కలవద్దు అని వార్నింగ్ ఇస్తాడు వెంకీ. కానీ వరుణ్ పట్టించుకోకుండా పెళ్లి చేసుకుంటాడు. పక్కింటాయన (రాజేంద్ర ప్రసాద్) సలహా మేరకు వరుణ్ వెంకీలు యూరోప్ కి వెళ్లారు. ఇది తెలుసుకున్న హారిక, హనీ లు కూడా అక్కడికి వెళ్తారు. వీళ్ళందరూ యూరోప్ లోని ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటారు. చివరికి భార్యలు మారతారా లేక భర్తలు మారుతారా అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటుల ప్రతిభ..
ఈ సినిమాతో వెంకీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఒకప్పటి ఆయన సినిమాల్లో కామెడీ ఈ సినిమాలో చూడొచ్చు. వరుణ్ తేజ్ తెలంగాణా యువకుడిగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో బాగా నటించారు. ఇద్దరి డైలాగ్స్ అండ్ కామెడీ టైమింగ్ కి అయితే థియేటర్ లు నవ్వులతో నిండిపోతుంది. తమన్నా. మెహ్రీన్ లు పాత్రలకు న్యాయం చేసారు. ఎం.ఎల్.ఏ గా రఘు బాబు, వరుణ్ ఫ్రెండ్ గా ప్రియదర్శి కామెడీ పండించారు. రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్ బాగానే ఉంది. కానీ చివర్లో వచ్చిన ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అమ్మమ్మ, నాయనమ్మ లుగా అన్నపూర్ణ, వై.విజయ ఆకట్టుకున్నారు.

F2 Fun And Frustration Movie Review-F2 Review First Day Talk Telugu Varun Tej Venkatesh

టెక్నికల్ గా..
గత సినిమాల్లో లాగే ఈ సినిమాలో కూడా మంచి డైలాగ్స్ అండ్ కామెడీ సన్నివేశాలు సమకూర్చారు దర్శకులు అనిల్ రావిపూడి గారు. భార్య బాధితులు అనే కాన్సెప్ట్ తో అందరిని ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకి హైలైట్. రెండు జంటలు కలిసి సందడి చేసే ఓ పాట ఈ సినిమాకి ప్లస్ పాయింట్. కానీ క్లైమాక్స్ తో నిరాశపరిచాడు దర్శకులు. దేవిశ్రీప్రసాద్ సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

విశ్లేషణ :
కథ కంటే ఈ సినిమాలో కామెడీకి ప్రాధాన్యం ఎక్కువ. అది టైటిల్ అండ్ ట్రైలర్ చూస్తేనే మనకి అర్ధమయ్యింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో ఆ ఫన్ కి ఫ్రస్ట్రేషన్ జోడించి మరింత ఎంటర్టైన్ చేశాడని అంటున్నారు. ఇద్దరు హీరోయిన్లు తమ నటనతో మెప్పించారని తెలుస్తోంది. భార్యా బాధితుల కథతో ఈ సంక్రాంతికి వచ్చిన ఇద్దరు అల్లుళ్లు ప్రేక్షకులను మెప్పించడం పక్కా అని అంటున్నారు.

F2 Fun And Frustration Movie Review-F2 Review First Day Talk Telugu Varun Tej Venkatesh

ప్లస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్
వరుణ్ తేజ్
కామెడీ వెంకటేష్

మైనస్ పాయింట్స్:

రొటీన్ స్టోరీ
సెకండ్ హాఫ్
వరుణ్ కి తెలంగాణ స్లాంగ్ అంతగా సూట్ అవ్వలేదు
దేవిశ్రీప్రసాద్ సంగీతం
క్లైమాక్స్
ప్రకాష్ రాజ్ క్యారెక్టర్

తెలుగుస్టాప్ రేటింగ్ :2.75/5

బోటం లైన్ – F2 – ఫస్ట్ హాఫ్ లో ఫన్…సెకండ్ హాఫ్ లో ఫ్రస్ట్రేషన్. హాస్య ప్రియులకు మంచి సంక్రాంతి కానుక.