ఇక్కడ ఈదులాడితే అచ్చం ఆకాశంలో ఈదుతున్నట్లే..!

లండన్‌‌ లో రెండు ఎత్తైన భవనాల మధ్య ఈత కొడుతంటే ఆకాశంలో ఈదుతున్నట్లే ఉంటుంది. భూమికి 115 అడుగుల ఎత్తులో నిర్మించిన స్విమ్మింగ్‌ పూల్‌ లో ఈత కొడుతుంటే స్వర్గంలో తేలుతున్నట్లు అనిపిస్తుంది.

 If You Swim Here, It's Like Achcham Is Swimming In The Sky  Swimming , Sky, Lond-TeluguStop.com

ఇందులో ఈత కొట్టాలంటే చాలా ధైర్యం కూడా ఉండాలి.ఈ స్విమ్మింగ్ ఫూల్ రెండు అంతస్తుల మధ్య ఉండటం వల్ల వేలాడుతున్నట్లుగా ఉంటుంది.

దీనిని స్కై‌ పూల్ అని కూడా పిలుస్తారు.ఈ స్విమ్మింగ్ ఫూల్ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది కాబట్టి ఈత కొడుతున్నప్పుడు రెండు భవనాల మధ్య కింద ఉండే జనాలను సరదాగా చూసేయవచ్చు.

రెండు పెద్ద పెద్ద భవనాల మధ్య స్విమ్మింగ్ ఫూల్ లో ఈత కొడుతూ ఉంటే ఆ భవనాల మధ్య ఉన్న జనాలు కూడా ఈత కొట్టేవాళ్లను చూస్తుంటారు.నడిచేవాళ్లకు పైన స్కై పూల్‌ లో కనిపిస్తారు కాబట్టి అదంతా చాలా సరదాగా ఉంటుంది.

ఇకపోతే ఈ స్విమ్మింగ్ ఫూల్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.మొత్తం 25 మీటర్ల పొడవుండే ఈ స్విమ్మింగ్‌ పూల్‌ ను హాల్ ఆర్కిటెక్ట్స్ డిజైన్ చేశారు.

ఈ స్విమ్మింగ్ ఫూల్ ను యాక్రిలిక్‌ అనే మెటీరియల్‌ తో తయారు చేశారు.ఇది సుమారు 148,000 గ్లాలాన్ల నీటిని మోసేలా డిజైన్ చేశారు.స్కై పూల్ ను ఎంబసీ గార్డెన్స్‌‌ లో గల నైన్ ఎల్మ్స్, బాటర్సీ పవర్ స్టేషన్ రీజనరేషన్ జోన్‌ లో ఏర్పాటు చేయడం వల్ల అదొక పర్యాటక ప్రాంతంగా తయారైంది.ఈ ఏడాది మే 19వ తేదీ నుంచి ఈ స్విమ్మింగ్‌ పూల్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.ఈ స్విమ్మింగ్‌ పూల్ నుంచి యూకే పార్లమెంట్, లండన్‌ ఐ, లండన్ సిటీ స్కైలైన్‌ లను ఆహ్లాదకరంగా చూడటానికి ఆస్కారం ఉండేటట్లు డిజైన్ చేశారు.10 అంతస్తుల భవనాల మధ్య స్విమ్మింగ్‌ పూల్ ను నిర్మించారు.ఇది నిర్మించిన ఇంజినీర్లు, వర్కర్లను చాలా మంది ప్రసంశిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube