ఇంట్లో వేడిని తగ్గించడానికి ఈ టిప్స్ ఫాలో అవుతే సరి..!

ఎండాకాలం రానే వచ్చింది.అడుగు బయటకు పెట్టాలంటే చాలు ఎండ వేడిమికి అల్లాడిపోతున్నారు ప్రజలు.

 F You Follow These Tips To Reduce The Heat In The House Is Ok Heat Nees, Cott-TeluguStop.com

బయటకి వెళ్లినా, ఇంట్లోకి వచ్చినాగాని వేడి దాటికి తట్టుకోలేకపోతున్నారు.ఈ ఎండాకాలం ప్రతి ఒక్కరి ఇంట్లో నిరంతరాయంగా ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది కదా.ఎంతసేపు ఫ్యాన్ తిరిగిన గాని వేడి గాలి వస్తూనే ఉంటుంది.అలాగని కూలర్ గాని, ఏసీ గాని పెట్టుకుంటే కరెంటు బిల్లు ఆకాశాన్ని అంటుతుందని భావించే వాళ్ళు లేకపోలేదు.

మరి అలాంటపుడు మేము చెప్పిన కొన్ని చిట్కాలు పాటించడం వలన మీ ఇంట్లో వేడిని తగ్గించుకోవచ్చు.

మొదటగా మీ ఇంట్లో ఉన్న ట్యూబ్‌లేట్‌ను తీసివేయండి.

వాటి స్థానంలో తక్కువ వాట్లు ఉన్న ఎల్‌ఈడీ బల్బులు ఉపయోగించండి.అవి వాడడం వలన కరెంటు బిల్లు తక్కువ వస్తుంది .అలాగే మీ ఇంట్లో ఉన్న కిటికీలను, వెంటిలేటర్లనుని శుభ్రంగా ఉంచుకోండి.దుమ్ము లేకుండా శుభ్రం చేయండి.

వాటి ద్వారా ఇంట్లోని వేడి బయటకు పోతుంది.మీ ఇంట్లో ఉన్న కిటికీలు గ్లాస్‌తో ఉంటే ఆ గ్లాస్‌ కలర్ డార్క్‌గా ఉండేలా చూసుకోండి.

బ్లూ, గ్రీన్‌ వంటి కలర్స్‌ అయితే బయటి వేడి గ్లాస్‌ ద్వారా లోపలికి రాదు.అలాగే బయటి గాలి లోపలికి రావడానికి కర్టెన్లను పక్కకు నెత్తి గాలిని రానివ్వాలి.

Telugu Cotton, Nees, Season-Latest News - Telugu

ఇంట్లో వేడి బాగా పెరిగితే నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి ఆ నీటిని నేలపై చల్లి తుడిచేయండి.ఉప్పు కారణంగా ఇంట్లో వేడి బాగా తగ్గిపోతుంది.అలాగే మీ ఇంటి పరిసరాల్లో పచ్చ గడ్డిని పెంచండి.అది చల్లటి గాలిని ఇస్తుంది.అలాగే వీలయినన్ని మొక్కలు పెంచండి.అవి గాలిలోని వేడి కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చేస్తాయి.

ఫలితంగా ఇంట్లో వేడి తగ్గుతుంది.నీడలో పెరిగే మొక్కల్ని ఇంట్లో అన్ని మూలలా ఉంచండి.

ఆ మొక్కలకి సాయంత్రం వేళ నీటిని పోయండి.ఆ నీటి ద్వారా వచ్చే చల్లటి గాలి ఇంటి లోపల వేడిని తగ్గిస్తుంది.

మీ ఇంట్లో జనపనారతో చేసిన వస్తువులు, షీట్లను ఎక్కువగా వాడండి.ఇంట్లో వేసే బెడ్‌ షీట్లు, కవర్లు అన్ని కూడా కాటన్‌వి అయి ఉండాలి.

అలాగే వదులుగా ఉండే కాటన్‌ డ్రెస్సులు వేసుకోవడం వలన అవి వేడిని పీల్చేస్థాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube