జుట్టు ఆరోగ్యంగా ఎదగాలంటే... అద్భుతమైన చిట్కాలు  

జుట్టు ఆరోగ్యంగా ఉంటేనే జుట్టు అందంగా,పొడవుగా పెరుగుతుంది. అయితే మారిన జీవనశైలిలో జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవటం చాలా కష్టమైన పని. మారిన జీవనశైలి,కాలుష్యం, పోషకాహార లోపం వంటి కారణాలతో చుండ్రు,జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి. దాంతో జుట్టు ఆరోగ్యంగా ఎదగదు. దాంతో చాలా మంది బాధపడుతూ కంగారు పడి బ్యూటీ పార్లర్ కి వెళ్లి చికిత్స చేయించుకుంటూ ఉంటారు. ఆలా చికిత్స చేయించుకోవటం వలన కొన్ని హానికర ప్రభావాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మనకు అందుబాటులో ఉండే కొన్ని మూలికల ద్వారా జుట్టును ఆరోగ్యంగా ఉండేలా చేయవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

మందారపువ్వు

మన పూర్వీకుల కాలం నుండి జుట్టు సంరక్షణలో మందారపువ్వును వాడుతూ ఉన్నారు. మందారపువ్వులో ఉండే కొన్ని రకాల పదార్ధాలు జుట్టును సంరక్షిస్తాయి. మందారపువ్వును కొబ్బరినూనెలో మరిగించి ఆ నూనెను వడకట్టి తలకు రాయాలి.

-

కొబ్బరిపాలు

కొబ్బరిపాలు జుట్టు రాలకుండా కాపాడటమే కాకుండా మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. జుట్టు పొడిబారకుండా,చిట్లకుండా కాపాడుతుంది. రాత్రి పడుకొనే ముందు కొబ్బరిపాలను జుట్టుకి పట్టించి మరుసటి రోజు తలస్నానము చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కలబంద

అందానికి సంబందించిన అన్ని రకాల ఉత్పత్తులలోను కలబంద ఉంటుంది. కలబంద,కోడిగుడ్డు మిశ్రమం జుట్టుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు పెరగటమే కాకుండా మంచి మెరుపు వస్తుంది.