ఆ హీరో కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డే.. కారణం?

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పూజ హెగ్డే గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.

 Extremely Eager And Excited Work Salman Khan Pooja Hegde-TeluguStop.com

ఇటీవలే కోవిడ్ పాజిటివ్ తో క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటుంది.ఇక ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల.

సినిమా షూటింగ్స్ వాయిదా పడగా.ఎంతో మంది సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు, సిని బృందాలకు కోవిడ్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.

 Extremely Eager And Excited Work Salman Khan Pooja Hegde-ఆ హీరో కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డే.. కారణం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్న పూజ హెగ్డే అభిమానులతో కొన్ని విషయాలు పంచుకుంది.

ప్రస్తుతం పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయంటూ.

చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.ఎప్పుడు శానిటైజర్ చేసుకోవాలి.

భౌతిక దూరాన్ని పాటించాలి.మాస్కు ధరించాలి వంటి అలవాట్లను చేసుకోవాలి అంటూ తెలిపింది పూజా.

అంతేకాకుండా ప్రజల్లో తమంతట తాము భద్రంగా ఉన్నామని ఎప్పుడూ అనిపిస్తుందో అప్పుడే పాత రోజులు వచ్చినట్లుగా తన భావిస్తానని తెలిపింది.ఈ వైరస్ జీవితం ఎలా నేర్చుకోవాలంటూ, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తగ్గడానికి సమయం పడవచ్చు కాని ప్రభుత్వ నియమాలను, వైద్య సూచనలను పాటించడం మంచిదని తెలిపింది.

Telugu Bollywood, Cirkus Movie, Home Isolation, Kabhi Eid Kabhi Diwali Movie, Pooja Hegde, Pooja Hegde Corona Positive, Pooja Hegde Waiting Salaman Khan, Ranveer Singh, Salman Khan, Tollywood-Movie

ఇక అన్ని సవ్యంగా జరిగి ఉంటే ఈ ఏడాది బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో నటించాల్సిన సినిమా.కబీ ఈద్.కబీ దివాలి సినిమా విడుదలయ్యేదంటూ.కానీ ఈ వైరస్ తమ ఆలోచనలు తారుమారు చేశాయని తెలిపింది.

ప్రస్తుతం ఈ పరిస్థితులు కారణంగా షూటింగ్ ఇంకా ఆరంభం కాలేదని, సల్మాన్ ఖాన్ తో నటించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది.అంతేకాకుండా ఆయనతో కలిసి చాలా మాట్లాడాలని ఉందని తెలిపింది ఈ అమ్మడు.

ఇక ఈ సినిమా ఫన్ ఫిలిమ్ అంటూ.చూస్తున్నంత సేపు ప్రేక్షకులు తప్పకుండా అవుతారని.

సల్మాన్ స్టైల్ ఆఫ్ యాక్షన్ కూడా ఉంటుందని తెలిపింది.ఇక ఈ ఏడాది జనవరిలో చాలా సినిమాలు విడుదలయ్యాయని.

ప్రేక్షకులు సినిమాలను చూడ్డానికి థియేటర్స్ కు బాగా వచ్చారని.అది తనకు చాలా సంతోషంగా అనిపించిందని తెలిపింది.

ప్రస్తుతం ఈ పరిస్థితి లేకపోయినట్లయితే మరిన్ని సినిమాలు ఈ ఏడాది విడుదలయ్యేవంటూ.ఇది దురదృష్టకరమని, త్వరలోనే పరిస్థితులు చక్కబడాలని, సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్ కు రావాలని కోరింది.

ఇక ప్రస్తుతం తను కోవిడ్ నుండి కోలుకుంటున్నానంటూ.మంచి పోషకాలున్న ఆహారాన్ని తీసుకుంటున్నానని, వ్యాయామాన్ని చేస్తున్నానని తెలిపింది.ఇక రన్ వీర్ సింగ్ హీరోగా చేసిన సర్కస్ సినిమా షూటింగులో పాల్గొన్నప్పుడు.నిబంధనల ప్రకారం కోవిడ్ టెస్టులు, మాస్కులు, భౌతిక దూరాలు పాటించిన కూడా తనకు వైరస్ రావడం బాధాకరమని తెలిపింది.

#PoojaHegde #Pooja Hegde #Ranveer Singh #KabhiEid #Salman Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు