అనుభవం నేర్పిన పాఠం

సాధారణ ప్రజలు మొదలు పరిపాలకుల వరకు, కిరణాం దుకాణదారు మొదలు దిగ్గజ సంస్థల సిఈవోల వరకు తప్పులు చేస్తుంటారు.కొన్ని తెలిసి చేస్తారు.

 Godavari Pushkaram: Measures Taken To Handle Holiday Rush-TeluguStop.com

కొన్ని తెలియక చేస్తారు.కొన్ని అహంభావం కారణంగా జరుగుతాయి.

మరికొన్ని అజ్ఞానం వల్ల జరుగుతాయి.ఎలా జరిగినా చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకొని అది రిపీట్‌ కాకుండా చూసుకోవాలి.

ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే పని చేస్తున్నారు.పుష్కరాల మొదటి రోజు తొక్కిసలాట జరిగి దాదాపు ముప్పయ్‌ చనిపోయిన తరువాత ఏపీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.

సీఎం చంద్రబాబు అక్కడే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు.

శనివారం (రంజాన్), ఆదివారం సెలవులు కావడంతో పుష్కరాలకు జనం పోటెత్తారు.ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రాలోనూ ఇదే పరిస్థితి.

ఆంధ్రలో ప్రధానంగా రాజమండ్రి లక్షలాదిమందితో కిటకిటలాడుతోంది.ఈ పరిస్థితి ప్రభుత్వానికి ముందే తెలుసు కాబట్టి అధికారులు అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు.

అత్యవసరమైన ఏర్పాట్లు చేశారు.హోం మంత్రి చినరాజప్ప పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఉభయ గోదావరి జిల్లాల్లోని అన్ని ఘాట్ల వద్ద తగిన ఏర్పాట్లు చేశామన్నారు.భద్రత కోసం ఐదువేల మంది అదనపు పోలీసులను నియమించారు.

వీరిని ఇతర రాష్ర్టాల నుంచి రప్పించారు.శుక్రవారం రాత్రి చంద్రబాబు నాయుడు అన్ని ఘాట్లను, రైల్వే స్టేషన్లను పరిశీలించారు.

పుష్కరాలకు వచ్చిన యాత్రికులతో మాట్లాడారు.మొదటి రోజు జరిగిన దుర్ఘటనతో షాకైన చంద్రబాబు దాన్నుంచి ఇంకా కోలుకోలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube