ఇటీవలే విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్ సమయంలో గెట్ అవుట్ అన్న పదం ఎంత వైరల్ అయ్యిందో మనందరికీ తెలిసిందే.అప్పటి నుంచి గెట్ అవుట్ అనే ఒక ఇంగ్లీష్ పదం బాగా పాపులర్ అయ్యింది.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డెబిట్ కి పిలిచి యాంకర్ దేవి నాగవల్లి హీరో విశ్వక్ సేన్ ని స్టూడియో నుంచి గెట్ అవుట్ అంటూ అవమానించిన విషయం తెలిసిందే.అయితే యాంకర్ దేవి నాగవల్లి నోటి నుంచి వచ్చిన ఆ పదం సోషల్ మీడియా తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం దద్దరిల్లిపోయింది.
ఆ విషయం జరిగి ఇప్పటికి వారం రోజులు అవుతున్నా కూడా ఆ ఛానల్ పై ఒక రేంజ్ లో ట్రోలింగ్స్ చేస్తూనే ఉన్నారు నెటిజన్స్.అంతేకాకుండా యాంకర్ దేవి నాగవల్లి హీరో పట్ల ప్రవర్తించిన తీరు పై ఇప్పటికీ ఆమెపై అభిమానులు మండిపడుతూనే ఉన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా గెట్ అవుట్ అనే పదాన్ని ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో వాడేశారు.తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది.
అయితే అందులో కెవ్వు కార్తిక్ స్కిట్ లో భాగంగా పొట్టి నరేష్ లేడీ గెటప్ వేసి పటాస్ సినిమా స్క్రిప్ట్ ని తీసుకుని ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.
ఈ క్రమంలోనే పొట్టి నరేష్ కెవ్వుకార్తిక్ ని గెట్ అవుట్ అంటూ కామెడీగా అనడంతో ఆ పంచ్ కి అక్కడున్న వారంతా కడుపుబ్బ నవ్వారు.స్కిట్ లో ఇదంతా ప్రీ ప్లాన్డ్ అని కెవ్వుకార్తీక్ అనగా.నరేష్ గెటౌట్.
గెటౌట్ అని యాంకర్ దేవి నాగవల్లిని ఇమిటేట్ చేశాడు.కెవ్వు కార్తీక్ కూడా.
విశ్వక్ సేన్ మాదిరిగా.వాట్ ద F** అనబోతుంటే.
నో.ఈ స్కిట్లో నుంచి గెట్ అవుట్ అంటూ దేవి నాగవల్లిని దింపేశాడు నరేష్.ఇదంతా దర్శకుడు అనీల్ రావిపూడి చూస్తూ తెగ ఎంజాయ్ చేశారు.ఇది అదే అన్నట్టుగా సైగ చేసి నవ్వేసుకున్నారు.ఇందుకు సంబంధించిన ప్రో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.