రోజాకు అడ్డంగా దొరికిపోయిన వర్ష, ఇమ్మానుయేల్.. ఒకేచోటా ఇద్దరు?

Extra Jabardasth Latest Promo Roja Shows The Secret Photo Of Varsha And Emmanuel

బుల్లితెరపై ఉన్న జోడిలలో అత్యధిక పాపులారిటీని సంపాదించుకున్న జోడి రష్మీ, సుధీర్.ఈ జంటకు బుల్లితెరపై మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా భారీగా అభిమానులు ఉన్నారు.

 Extra Jabardasth Latest Promo Roja Shows The Secret Photo Of Varsha And Emmanuel-TeluguStop.com

ఈ జంట తరువాత అనసూయ, హైపర్ ఆది,అలాగే వర్ష ఇమ్మానియేల్ జోడి లకు కూడా యమ డిమాండ్ ఉంది.ఈ మూడు జంటలు తరచుగా స్కిట్ లలో పాల్గొంటూ, పోగ్రామ్ లలో సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు.

ఈ మధ్యకాలంలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, వర్ష జోడీ మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.వీరి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

 Extra Jabardasth Latest Promo Roja Shows The Secret Photo Of Varsha And Emmanuel-రోజాకు అడ్డంగా దొరికిపోయిన వర్ష, ఇమ్మానుయేల్.. ఒకేచోటా ఇద్దరు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ జంటకు కూడా రష్మీ సుధీర్ కి పెళ్లి చేసినట్టుగా, వర్షా,ఇమ్మాన్యుయేల్ జంటను కూడా పెళ్లి పీటలు ఎక్కించారు.అప్పుడప్పుడు స్కిట్ లలో వారి మధ్య ఉన్న ప్రేమను బయట పెడుతూ రోమాంటిక్ సాంగులకు డాన్సులు వేయడం లాంటివి కూడా చేస్తున్నారు.

 అయితే ఈ జోడీ రోమాంటిక్ మూమెంట్స్‌పై రాను రాను బోర్ రావడంతో ఈ మధ్యకాలంలో కాస్త తగ్గించేసినా మళ్ళీ దాన్నే ఫోకస్ చేస్తూ వాళ్ళిద్దరి గుట్టు రట్టు చేసింది జబర్దస్త్ జడ్జ్ రోజా.

అయితే తాజాగా డిసెంబర్ 3న ప్రసారం కాబోయే ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ చేసారు.ఇక అందులో వర్ష, ఇమ్మాన్యుయేల్ లతో పాటు యాంకర్ రష్మీ కూడా స్కిట్ లో సందడి చేస్తూ కనిపించింది.అప్పడు రోజా రెండు రోజుల క్రితం మీరిద్దరు ఎక్కడున్నారని అడుగుతూ వర్ష, ఇమ్మానుయేల్ లవ్ ట్రాక్ తెరపైకి తెచ్చింది రోజా.

దీంతో ఆ రోజు నేను షూటింగ్‌లో ఉన్నాను అని వర్ష అనగా,ఇమాన్యుయేల్ నేను వేరే చోట ఉన్నానని అంటాడు.అప్పుడు రోజా వారిద్దరు కారులో కలిసి దిగిన ఫోటో సీక్రెట్ ఫొటో బయట పెట్టేసింది రోజా.

దీనిపై వర్ష రియాక్ట్ అవుతూ.ఆ రోజు షూట్ జరుగుతుండగా నాకు బాలేదని ఇమాన్యుయేల్‌కు ఫోన్ చేశాను.

అలా అక్కడకు వచ్చాడంటూ ఇమ్మానుయేల్ గురించి చెప్పుకొచ్చింది వర్ష.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#Rashmi #Sudhher #Varsha #Skit #Emmanuel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube