మరోసారి రష్మీ-సుధీర్ రొమాన్స్ ‌తో అలరించబోతున్నారా...?!

తెలుగు బుల్లితెరపై రష్మి సుధీర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బుల్లితెరపై ఏదైనా గాసిప్ వచ్చిందటే మొదటగా వినిపించే పేరు వీళ్లిద్దరి పేరే.

 Viral Video, Social Media, Jabardash, Extra Jabardash, Sudigali Sudheer, Rashmi,-TeluguStop.com

అంతలా యూట్యూబ్ చానల్స్ వీరి ఇద్దరిని ఆడేసుకుంటున్నారు.అసలు విషయంలోకి వెళ్తే ఈ టీవీ ఛానల్ లో ప్రచారం అయ్యే ఎక్స్ట్ ట్రా జబర్దస్త్ షో తాజాగా 300 ఎపిసోడ్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఇంతవరకు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అండ్ వేరువేరుగా ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం కోసం అందరూ ఒకే చోట చేరారు.యాంకర్ అనసూయ, యాంకర్ రవి, సుధీర్, రష్మీ అందరు కూడా ఒకే వేదికపై తళుక్కుమన్నారు.

ఎప్పటిలాగే ఈ కార్యక్రమంలో కూడా సుధీర్ రష్మీ జోడి అభిమానులను అలరించేందుకు వారి హాట్ రొమాన్స్ తో కూడిన పర్ఫామెన్స్ ఉండబోతుందని అర్థమవుతుంది.

తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ 300 ఎపిసోడ్ సంబంధించి ప్రోమో ను విడుదల చేశారు మల్లెమాల టీవీ యాజమాన్యం.

ఇక ఈ ప్రోమో లో సుడిగాలి సుధీర్ ను జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసుకునే ఆర్టిస్టులందరూ చుట్టుముట్టి ఆటపట్టించినట్టుగా అర్థమవుతుంది.వారందరూ సుధీర్ ని అన్నయ్య.అన్నయ్య… అని పిలుస్తూ సుధీర్ కు చికాకు పుట్టించేలా చేశారు.అలాగే సుడిగాలి సుధీర్ అండ్ టీం లేడీ గెటప్స్ తో అదిరిపోయే పర్ఫామెన్స్ చేసినట్టు అర్థమవుతుంది.

అయితే ఈ వేడుకల్లో మొట్టమొదటిసారిగా యాంకర్ రవి కూడా కనపడటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

ఈ స్పెషల్ కార్యక్రమానికి జబర్దస్త్ ఆర్టిస్టులు వారి కుటుంబ సభ్యులను కూడా తీసుకువచ్చినట్టు ప్రోమో చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.అంతేకాదండోయ్… స్పెషల్ అట్రాక్షన్ గా టిక్ టాక్ స్టార్ దుర్గారావు కూడా కనబడపోతున్నాడు.మొత్తానికి ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు ఎక్స్ ట్రా జబర్దస్త్ టీం.ప్రస్తుతం ఈ ఎపిసోడ్ సంబంధించి ప్రోమో రిలీజ్ చేయగా అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ప్రోమోను చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube