భారతీయ రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది.రూ.2 వేల నోట్ల మార్పిడికి గడువు పెంచుతున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు అక్టోబర్ 7వ తేదీ వరకు రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంకు అవకాశం కల్పించింది.
అయితే రూ.2 వేల నోట్ల ఉప సంహరణకు గడువు సెప్టెంబర్ 30 తో ముగియనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో గడువు పొడిగిస్తారా లేదా అన్న సందిగ్ధతకు బ్రేక్ వేసింది ఆర్బీఐ.
ఈ నోట్లు కలిగిన వారు సమీపంలోని బ్యాంకుకు వెళ్లి మార్పిడి చేసుకునేందుకు అవకాశం కల్పించింది.ఆధార్, పాన్ వంటి ఆధారాలు లేకుండానే బ్యాంకులో సులభంగా నోట్లను మార్పిడి చేసుకోవడం లేదా డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది.