కరోనా ఎఫెక్ట్ : డ్రైనేజీ పాలు కానున్న కోటి లీటర్ల బీరు...

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా మద్యం దుకాణాలను మూసి వేయడంతో మందుబాబులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

 Liquor Shop News, Beer News, Hyderabad, Telangana Wine News, One Crore Liters Be-TeluguStop.com

అంతేగాక ఇటీవల కాలంలో కొందరు మద్యం దొరక్క విచక్షణ కోల్పోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.అయితే తాజా సమాచారం ప్రకారం మద్యం దుకాణాల్లో నిలువ ఉన్నటువంటి బీరు డ్రైనేజీ పాలు కాబోతున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందులో మద్యం దుకాణదారులు విక్రయించేటువంటి బీరు యొక్క కాలవ్యవధి తయారుచేసిన తేదీ నుంచి కేవలం 6 నెలలు మాత్రమే ఉంటుంది.అయితే ప్రస్తుతం ఇప్పటికే కొందరు మద్యం దుకాణాలు దారులు బీరుని ఓవర్ స్టాక్ ఉంచుకోవడంతో ఉపయోగించే తేదీ తొందర్లోనే ముగియనుంది.

అయితే ఈ బీరు దాదాపుగా కోటిన్నర లీటర్లు ఉన్నట్లు అంచనా.కాగా ఇప్పుడప్పుడే లాక్ డౌన్ ఎత్తివేసే సూచనలు కనబడక పోవడంతో విక్రయ గడువు తేదీ ముగిసిన బీరుని డ్రైనేజిలో పారబోయడం తప్ప చేసేమేదేమి లేదు.

 ఈ విషయం తెలుసుకున్న కొందరు మందుబాబులు మద్యం దుకాణదారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఒకపక్క మందు దొరక్క అల్లాడుతుంటే బీరుని డ్రైనేజ్ పాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

మరోపక్క మద్యం దుకాణం దారులు డబ్బులు వెచ్చించి కొన్నటువంటి బీరుని  డ్రైనేజ్ పాలు చేస్తే తమకు తీవ్ర నష్టం వస్తుందని వాపోతున్నారు.మరికొందరు ఇందుకు ప్రత్యామ్నాయంగా లాక్ డౌన్ సమయంలో కూడా రోజులో రెండు లేదా మూడు గంటల పాటు మద్యం విక్రయాలకు అనుమతిస్తే తమ వద్ద ఉన్నటువంటి మద్యం అమ్ముకుంటామని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారు.

మరి ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube