భారత్‌తో క్లోజ్‌గా అమెరికా, ఆస్ట్రేలియా .. వెనుకబడ్డ కెనడా, మంచిది కాదంటోన్న నిపుణులు

భారత్ తో కెనడా వ్యూహాత్మక సంబంధాలను మరింతగా పెంచుకోవాలని.లేని పక్షంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో పుట్టిన ప్రజాస్వామ్య వేదిక (క్వాడ్) నుంచి అది మినహాయించబడే ప్రమాదం వుందని నిపుణులు అంటున్నారు.

 Experts Say Canada Must Deepen Strategic Ties With New Delhi,australia,america,c-TeluguStop.com

ఈ మేరకు కెనడియన్ దినపత్రిక నేషనల్ పోస్ట్ లో ఓ కథనం ప్రచురితమైంది.భారత్ తో భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడంలో కెనడా ఇప్పటికే దాని సన్నిహిత మిత్రదేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా కంటే వెనుకబడి వుంది.

ఇండో పసిఫిక్ ప్రాముఖ్యత పెరుగుతున్నందున, సురక్షితమైన, సంపన్నమైన ప్రపంచం కోసం భారతదేశంతో కలిసి ఒక ప్రముఖ పాత్రను పోషించాలని కెనడా ఆసక్తిగా వుందని ఒట్టావా కేంద్రంగా పనిచేస్తున్న థింక్ ట్యాంక్ మెక్‌డొనాల్డ్ లారియర్ ఇన్‌స్టిట్యూట్ (ఎంఎల్ఊ) అభిప్రాయపడింది.

సోమవారం పోస్ట్ చేసిన ఈ వ్యాసంలో ఎంఎల్ఐ ఫారిన్ పాలసీ అండ్ నేషనల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ హెడ్ షువాలోయ్ మజుందార్, ఇండియాస్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ లోని సీనియర్ ఫెలో సమీర్ పాటిల్ తమ అభిప్రాయాలను వెల్లడించారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , ఇతర నాయకులు భారత్ తో పాశ్చాత్య సహకారాన్ని మెరుగుపరచడానికి కృషి చేస్తుంటే కెనడా పూర్తిగా వెనుకబడి వుందన్నారు.

భారత్, యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్ లతో కూడిన క్వాడ్, AUKUS ఆస్ట్రేలియా, యూఎస్, యూకే.

ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ (ఐపీఈఎఫ్) వంటి వేదికలు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపాయి.అయితే వీటిలో ఎందులోనూ కెనడా ప్రస్తావన లేదు.

అధునాతన రక్షణ పరిశ్రమ, లీడింగ్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ ల ద్వారా భారత్ సహా ఇండో పసిఫిక్ రీజియన్ లోని దేశాలకు కెనడా ఎన్నో అవకాశాలను అందిస్తోంది.

Telugu America, Australia, Canada, Summit, India, Indo Pacific, Ipef, Japan, Del

ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో ఇండో పసిఫిక్ దేశాల భద్రతను మరింత తీవ్రంగా అంచనా వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.ఆసియాలోని ప్రజాస్వామ్య దేశాలతో ముఖ్యంగా భారత్, జపాన్ లతో భద్రతాపరమైన సహకారాన్ని నిర్మించేందుకు పశ్చిమ దేశాలు వేగంగా పావులు కదుపుతున్నాయని వారు తెలిపారు.

అయితే నవంబర్ 2019 నుంచి కెనడా సరికొత్త ఇండో పసిఫిక్ వ్యూహంపై పనిచేస్తూ వస్తోంది అది ఈ ఏడాది చివరిలో ప్రకటించబడుతుందని భావిస్తున్నారు.

ఈ విధానాన్ని అభివృద్ధి చేయడానికి కెనడా విదేశాంగ మంత్రిత్వ శాఖ, గ్లోబల్ అఫైర్స్ కెనడా ద్వారా ప్రత్యేక సెక్రటేరియట్ ను ఏర్పాటు చేశారు.గత నెలలో జర్మనీలో జరిగిన జీ7 దేశాల సమ్మిట్ లో భారత్- కెనడా దేశాల ప్రధానుల భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా వార్తలు వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube