ఈ నెల12న కరోనా వ్యాక్సిన్ పంపిణీపై నిపుణుల కమిటీ భేటీ..!  

Corona vaccine, expert committee, ICMR, india government, nithi ayogh, - Telugu Corona Vaccine, Expert Committee, Icmr, India Government, Nithi Ayogh

కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ఈ నెల 12వ తేదీన నిపుణుల కమిటీ భేటీ కానుంది.కరోనా వ్యాక్సిన్ సేకరణ, నిర్వహణతో పాటు పంపిణీ వ్యవహరాలపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

TeluguStop.com - Expert Committee On Corona Vaccine Meeting On 12th Of This Month

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

బుధవారం నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ భేటీ కానుంది.రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యాక్సిన్ తయారీదారులు సహా అన్ని భాగస్వామ్య పక్షాలతో ఈ నిపుణుల కమిటీ చర్చలు జరుపుతోంది.

TeluguStop.com - ఈ నెల12న కరోనా వ్యాక్సిన్ పంపిణీపై నిపుణుల కమిటీ భేటీ..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక అందరికీ అందేలా వ్యుహాలను ఈ కమిటీ రూపొందిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.కోల్డ్ చైన్ లాజిస్టిక్స్‎తో పాటు వ్యాక్సిన్ ఇచ్చే వారికి శిక్షణ అందించడంపై ఈ కమిటీ దృష్టి సారించింది.

కాగా, ప్రస్తుతం దేశంలో మూడు కోవిడ్–19 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ పలు దశల్లో ఉన్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.భారత్ బయోటెక్‎తో పాటు జైడస్ కాడిలా లిమిటెడ్ తయారు చేసిన వ్యాక్సిన్‎ల ట్రయల్స్ రెండో దశలో ఉన్నాయని ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరామ్ భార్గవ వెల్లడించారు.

ఈ నేపథ్యంలో భారత్‎లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ, ఎవరికి ముందుగా అందించాలి, వ్యాక్సిన్ ను ఒక చోటు నుంచి మరో చోటికి ఎలా తరలించడం, భద్రపరచడం వంటి అంశాలపై నిపుణుల కమిటీ చర్చించనుంది.

#Corona Vaccine #ICMR #Nithi Ayogh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Expert Committee On Corona Vaccine Meeting On 12th Of This Month Related Telugu News,Photos/Pics,Images..