శ్రీవారికి కానుకలుగా ఖరీదైన వాచీలు.. వాటికి త్వరలో వేలం..!

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు.వీరిలో చాలావరకు ప్రజలు తమకు చేతనైనంత కానుకలను అందజేస్తుంటారు.

 Expensive Watches As Gifts For Lord Shrinivasa They Will Be Auctioned Soon , Ttd-TeluguStop.com

కొందరు బంగారు బిస్కెట్లు, కోట్లాది రూపాయలను దానం ఇస్తే మరి కొందరు తమ శక్తికొద్దీ 100, 200 రూపాయలు హుండీలో వేస్తుంటారు.తమకు ఇష్టమైన వస్తువులను కూడా కానుకగా ఇచ్చి దేవుడి పట్ల తమ భక్తిని చాటుకుంటారు.

అయితే ఇలా దేవుడి హుండీలో వేసిన ఖరీదైన వాచీలను వేలం వేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు హుండీలో కానుకగా సమర్పించిన వాచీలను వేలం వేయడానికి సిద్ధమైంది.

అయితే ఇలా వేలం వేసిన వాచీలను కొనుగోలు చేసేందుకు చాలా మంది భక్తులు సిద్ధంగా ఉన్నారు.ఎందుకంటే హుండీలో ఉన్న కానుకలు తీసుకుంటే స్వామి వారి ఆశీస్సులు పొందొచ్చని ప్రజలు భావిస్తారు.

అలాంటి వారి కోసం ఆగస్ట్ 18న వేలం వేసేందుకు టీటీడీ కసరత్తులు చేస్తోంది.

Telugu Ap, Gift, Giftslord, Thirumala, Watches-Latest News - Telugu

ఈ నెల 18న వాచీల వేలాన్ని ఆన్‌లైన్‌లోనే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది.తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు, ఇతర అనుబంధ ఆలయాల హుండీల్లో భక్తులు ఇచ్చిన వాచీలను ఈ-వేలంలో విక్రయిస్తారు.టీటీడీ ప్రకారం, ఈ-వేలంలో సీకో, హెచ్ఎమ్‌టీ, టైటాన్, సోనీ, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాటా, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్, సిటిజన్, రొలెక్స్‌తోపాటు ఇతర కంపెనీల వాచీలు ఉంటాయి.

వీటిలో కొత్త వాటికి ఒక వేలం రేటు, పాత వాటికి మరొక వేలం రేటును నిర్ణయిస్తారు.వేలం పాట పాడాలనుకునేవారు మరిన్ని వివరాలకు 0877-2264429 నంబర్‌కి ఫోన్ కాల్ చేయవచ్చు.టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ద్వారా ఈ వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube