ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటున్న స్టార్స్.. ఇది ఇప్పటి ట్రెండ్ కాదు సుమీ..

సినీ వరల్డ్ ఎలా ఉంటుందో చాలా మందికి ఒక అవగాహనా ఉండే ఉంటుంది.సక్సెస్ వస్తే ఎలా అందలం ఎక్కిస్తారో అలాగే ఫెయిల్యూర్ వస్తే కూడా అస్సలు పట్టించుకునే వారే ఉండరు.

 Expensive Gifts Given By Celebrities Kamal Hasan Salman Khan Ram Charan Details,-TeluguStop.com

అయితే కొంత మంది మాత్రం సూపర్ హిట్ కొడితే గిఫ్ట్ లు ఇచ్చిపుచ్చుకుంటూ అదొక ట్రెండ్ లాగా ఫాలో అవుతున్నారు.అయితే సక్సెస్ ఇచ్చిన ఆనందంలో నిర్మాతలు హీరోలకు, దర్శకులకు ఖరీదైన గిఫ్ట్స్ ఇస్తూ వారు ఆనందాన్ని అలా తెలుపుతూ వారి ట్యాలెంట్ ను సత్కరిస్తున్నారు.

అయితే ఇప్పుడు ట్రెండ్ అయినా ఈ పని అప్పట్లోనే సల్మాన్ ఖాన్ వంటి వారు చేసారు.సల్మాన్ ఖాన్ జాక్వెలిన్ ఫెర్నాడజ్ మధ్య మంచి స్నేహం ఉంది అనే విషయం చాలా మందికి తెలుసు.

వీరిద్దరూ కిక్ సినిమాలో జోడీగా కనిపించారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సల్మాన్ ఖాన్ అప్పట్లోనే 2.50 కోట్ల రూపాయలతో ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చాడు.

అలాగే అమితాబ్ బచ్చన్ విధు వినోద్ చోప్రా ఏకలవ్య సినిమాలో నటించడానికి ఎంతో పారితోషికం అడుగలేదు.

అయితే ఈ సినిమా అంతగా హిట్ అవ్వలేదు.అయినా కూడా విధు వినోద్ అమితాబ్ కు రోల్స్ రాయిస్ ఫాంటమ్ ను బహుమతిగా ఇచ్చాడు.

Telugu Amitab Bachchan, Bhool Bhulaiyaa, Expensive Gifts, Kamal Hasan, Karthik A

ఇక ఇంతకుముందు కేజిఎఫ్ చాప్టర్ 1 సక్సెస్ సాధించిన సమయంలో కూడా ఇలా ఖరీదైన గిఫ్ట్ ఇచ్చుకున్నారు.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజిఎఫ్ తెరకెక్కిన విషయం తెలిసిందే.ఈ సినిమ సక్సెస్ తో యష్ ఒక్కసారిగా స్టార్ అయ్యాడు.ఈ ఆనందంలో ఆయన నీల్ కు ఫోన్ కానుకగా ఇచ్చాడు.

ఇక ట్రిపుల్ ఆర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ టెక్నీషియన్స్ ను ఇంటికి పిలిచి మరీ భోజనం పేటి బంగారు నాణేలను కానుకగా ఇచ్చాడు.అలాగే చిరంజీవి, చరణ్ కూడా చాలా సార్లు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకున్నారు.

Telugu Amitab Bachchan, Bhool Bhulaiyaa, Expensive Gifts, Kamal Hasan, Karthik A

ఇక ఇటీవలే కమల్ హాసన్ చాలా రోజుల తర్వాత విక్రమ్ సినిమాతో హిట్ అందుకోవడంతో ఆ ఆనందంలో డైరెక్టర్ కు ఖరీదైన కారు కానుకగా ఇచ్చాడు.ఇక బాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత హిట్ పడడంతో సంతోషంగా ఉన్నారు.భూల్ భూలయ్య 2 నిర్మాత భూషణ్ కుమార్ కార్తీక్ ఆర్యన్ కు అదిరిపోయే గిట్ ఇచ్చాడు.ఈ కారు ఖరీదు 4.5 కోట్లు ఉంటుందట.దీంతో ఇప్పుడు ఈ గిఫ్ట్ అక్కడి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.

ఇలా ఈ గిఫ్ట్ లు ఇచ్చిపుచ్చుకుంటూ.వారి ట్యాలెంట్ నుయ్ మరింత ప్రోత్సహిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube