7 రోజుల్లో 27 లక్షలు ఖర్చు.. షాకిస్తున్న బిర్యానీ బిల్లు!!

7 రోజుల్లో ఎంత ఆహారం తిన్నా మహా అంటే 50 వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చవుతుంది.కానీ కొందరు వ్యక్తులు లాంగించేసిన బిర్యానీ బిల్లు అక్షరాలా 27 లక్షల రూపాయలు అయింది.

 Expensive Biryani Cost Is 27 Lacs For 7 Days, Biryani Cost , Viral , Viral Nwes-TeluguStop.com

షాక్ అయ్యారు కదూ.ఇంతకీ ఇంత మొత్తంలో బిల్లు ఎందుకు అయిందో తెలుసుకుంటే.కొద్ది రోజుల క్రితం న్యూజిలాండ్‌ క్రికెట్ జట్టు పాకిస్థాన్ తో ఆటలు ఆడే ప్రసక్తే లేదని చివరి నిమిషంలో పర్యటన రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) కూడా అదే పాట పాడింది.

చాలా ఏళ్లుగా క్రికెట్ ఆడ లేక ఎంతో బాధ లో మునిగి పోయిన పాకిస్తాన్ కి వరుస షాకులు తగులుతుండటం బాధాకరం.ఈ నేపథ్యంలోనే పుండు మీద కారం చల్లినట్లు పాకిస్తాన్ కి మరొక షాక్ తగిలింది.

మ్యాచ్ నిర్వహణ భద్రతా సిబ్బంది తిండికి అయిన బిల్లు చూసి పాకిస్థాన్ అల్లాడుతోంది.ఇప్పటికే అనేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాక్ క్రికెట్ బోర్డుకు భద్రతా సిబ్బంది తిన్న బిర్యానీకి అయిన ఖర్చు పెద్ద తలనొప్పిగా మారింది.

ఇటీవల న్యూజిలాండ్ జట్టు ఇస్లామాబాద్ లోని ఓ హోటల్ లో బస చేసింది.అయితే వీరి భద్రత కోసం పాకిస్తాన్ ప్రభుత్వం 500 మంది పోలీసులను నియమించింది.

వీరు రోజుకి రెండు సార్లు కడుపునిండా బిర్యానీ తిన్నారట.అందుకే బిల్లు 27 లక్షల రూపాయలు అయ్యిందని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.

Telugu Lacs, Days, Biryani Cost, Hotel, Newzeland, Security Staff, Sport-Latest

న్యూజిలాండ్ జట్టు రూపాయి బిళ్ల కూడా చెల్లించకుండా స్వదేశానికి తిరిగి వెళ్లిపోవడంతో.పాక్ ప్రభుత్వం ఆ బిల్లులను పాక్ ఆర్థికశాఖ దగ్గర పెండింగ్ లో ఉంచిందట.కమాండోలు, సరిహద్దు భద్రతాదళం పోలీసులు కూడా న్యూజిలాండ్ జట్టుకు భద్రత కల్పించాలని వారి భోజనం ఖర్చులన్నీ పాకిస్తాన్ బోర్డే చెల్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.అయితే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నుంచి కొంత మొత్తంలో డబ్బును నష్టపరిహారంగా అడిగే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube