అమెరికాలో మధ్యస్థాయి అనుభవం: భారత్‌లోని బడా కంపెనీల్లో అవకాశాలపై ఎన్ఆర్ఐల ఆరా

విదేశీ కార్మికులపై అమెరికా ప్రభుత్వం వీసా నిబంధనలు కఠినతరం చేస్తుండటంతో అక్కడి ప్రవాస భారతీయులు తీవ్ర ఆందోళన ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో అమెరికాలోని పలు కంపెనీల్లో మధ్య తరగతి, సీనియర్ స్థాయి హోదాల్లో పనిచేస్తున్న ఎన్ఆర్ఐలు భారత్‌లోని అవకాశాలపై దృష్టి సారిస్తున్నారు.

 A Share Of The India Pie: Expat Indians Eyeing Desi Role As America Tightens Vis-TeluguStop.com

స్టాంటన్ ఛేజ్, ఆర్‌జీఎఫ్ ఎక్జిక్యూటివ్ సెర్చ్, కార్న్ ఫెర్రీ వంటి సంస్థల అధ్యయనం ఈ విషయం వెల్లడైంది.

కోవిడ్ 19 వ్యాప్తి మొదలైనప్పటి నుంచి అమెరికాతో పాటు మరికొన్ని దేశాలలో వీసా ఆంక్షలు పెరగడంతో వారి సీవీల్లో ‘‘ భారత్‌లో అనుభవం ’’ వంటి కాలమ్‌ను చేర్చుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

వైరస్ కారణంగా కుటుంబంతో కలిసి వుండాలనే కోరికతో పాటు వీసా ఆంక్షలు కూడా ఇందుకు కారణం.కరోనాకు ముందు రోజులతో పోల్చితే భారత్‌లో అవకాశాలపై ఎంక్వైరీ చేస్తున్న ప్రవాస భారతీయుల సంఖ్య 300 శాతం పెరిగిందని స్టాంటన్ ఛేజ్ ఇండియా మేనేజింగ్ పార్ట్‌నర్ మాలా చావ్లా తెలిపారు.

Telugu Shareindia, Americatightens, Hb Visa-

హెచ్ 1బీ వీసా జారీలో ఇబ్బందుల కారణంగా అమెరికాలోని చాలా కంపెనీలు, ప్రధానంగా ఐటీ కంపెనీలు ఇప్పుడు స్థానికులనే రిక్రూట్ చేసుకుంటున్నాయని ఆర్జీఎఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్చ్ ఇండియా ఎండీ సంజయ్ ఆర్ శాస్త్రి అన్నారు.భారతీయ ఐటీ కంపెనీలు, ఔషధ సంస్థలకు అమెరికా అతిపెద్ద మార్కెట్ అన్న సంగతి తెలిసిందే.భారత్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల సంస్థకు సీటీవోగా ఒక ప్రవాస భారతీయుడిని నియమించే బాధ్యత సదరు కంపెనీ తమకు అప్పగించిందని శాస్త్రి చెప్పారు.

స్థానిక తయారీని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రవాసులకు అనేక ఆకర్షణీయమైన అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

అలాగే భారత్‌లోని ఓ పెద్ద ఎఫ్ఎంసీజీకి అధిపతిగా యూరప్ నుంచి వచ్చిన ఒక ఎన్ఆర్ఐని నియమించినట్లు కార్న్ ఫెర్రీ తెలిపింది.అభివృద్ధి చెందిన మార్కెట్లతో పాటు భారత్, చైనా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో.

అనుభవం వున్న వారికి అపారమైన డిమాండ్ ఉంది.దీని వల్ల ప్రవాస భారతీయులు భారత్‌పై తమ దృష్టి కేంద్రీకరించారు.

మరికొందరైతే స్వదేశానికి వెళ్లడానికి వేతనాల్లో కోతను ఎదుర్కోవడానికి సైతం సిద్ధంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube