బాబును జైల్లో వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయట

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును ప్రస్తుత ఏపీ ప్రభుత్వం అరెస్ట్‌ చేయించి లోపల వేయించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా టీడీపీ నాయకుడు జేసీ దివాకర్‌ రెడ్డి అంటున్నారు.ఆయన తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన సందర్బంగా ఈ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

 Exministerjc Diwakar Reddycommentson Chandrababu Naidu-TeluguStop.com

ఏపీ ప్రభుత్వం చాలా విధాలుగా చంద్రబాబు నాయుడును జైల్లో వేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.కాని బాబు మాత్రం దొరకడం లేదు అంటూ ఆయన అన్నాడు.

ఈ విషయాన్ని నేను స్వయంగా బాబుతో కూడా చెప్పాను.బాబు ఎప్పుడు జైలుకు వెళ్తున్నావు అంటూ నేను ఆయన్ను ప్రశ్నిస్తే వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తప్పు చేయని నేను జైలుకు వెళ్లను అన్నాడు.

ఆయన చాలా నమ్మకంతో ఉన్నాడు.బీజేపీ వైకాపా ప్రభుత్వంతో కలిసిందో లేదో నేను చెప్పలేను.కాని బాబు పై మాత్రం చాలా కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.జేసీ వ్యాఖ్యలపై వైకాపా నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు.

అక్రమ కేసులు చంద్రబాబు నాయుడుకు అలవాటు అంటూ ఎద్దేవ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube