ఎగ్జిట్ పోల్స్ పై ఆశగా చూస్తున్న రాహుల్ గాంధీ! చంద్రబాబు మంత్రం పని చేస్తుందా  

చంద్రబాబు జాతీయ రాజకీయాలలో వ్యూహాల ఫలితం డిసైడ్ చేయనున్న ఎగ్జిట్ పోల్స్. .

Exit Polls Will Be Decide Chandrababu Strategy In National Politics-

ఎగ్జిట్ పోల్స్ కి సమయం దగ్గర పడింది.ఈ ఎగ్జిట్ పోల్స్ రాజకీయాలలో ఎవరి గెలుపు ఓటములు సాశించకపోయిన రాజకీయ పార్టీలకి మాత్రం ఫలితాలు రిలీజ్ అయ్యేంత వరకు కొంత ఉత్సాహాన్ని మాత్రం ఇస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కొన్ని సార్లు నిజమైన అన్ని సార్లు నిజమైన సందర్భాలు లేవు..

Exit Polls Will Be Decide Chandrababu Strategy In National Politics--Exit Polls Will Be Decide Chandrababu Strategy In National Politics-

అలాగే ఒకటి రెండు సంస్థలు తప్ప చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో ఫలితాలు అంచనా వేయడంలో మాత్రం కచ్చితత్వం తప్పుతాయి అని చెప్పాలి.ఇప్పటి వరకు దేశ రాజకీయాలలో వచ్చిన ఎగ్జిట్ ఫలితాలలలో రాజకీయ పార్టీల భవిష్యత్తుని ఒకటి రెండు సంస్థలు మాత్రం కచ్చితంగా అంచనా వేయగాలిగాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం తుది దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది.

ఈ పోలింగ్ ముగియగానే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మీద ద్రుష్టి పెడుతుంది.ఇదిలా ఉంటే మరో వైపు దేశ వ్యాప్తంగా మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడానికి సిద్ధం అవుతున్నాయి.ఇక కేంద్రంలో మోడీని ఓడించాలనే లక్ష్యంతో ఉన్న చంద్రబాబు అన్ని ప్రాంతీయ పార్టీలని కాంగ్రెస్ కి దగ్గర చేసే ప్రయత్నం చేసారు.

ఇది చాలా వరకు ఫలించింది అని చెప్పాలి.ఇక ఫలితాలకి ముందు మరో సారి కాంగ్రెస్ అధినేత రాహుల్ తో చంద్రబాబు మంతనాలు చేస్తున్నారు.ఇక రాహుల్ ని ప్రధాని చేయడానికి చంద్రబాబు తన రాజకీయ చతురత మొత్తం ఉపయోగిస్తున్నాడు.

మరి ఇలాంటి సందర్భాలలో ఎగ్జిట్ పోల్స్ కొంత వరకు రాహుల్ గెలుపుని అంచనా వేసే అవకాశం ఉంది.మరి చంద్రబాబు మంత్రం పని చేస్తే ఆ ఫలితం ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి రాహుల్ కూడా ఈ పోల్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.