విశ్లేషణ : ఎగ్జిట్‌ పోల్స్‌ను ఎంత వరకు నమ్మవచ్చు?

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రస్థానం ముగింపు దశకు వచ్చింది.

 Exit Polls Results 2019-TeluguStop.com

ఓట్లు పూర్తి అవ్వడంతో కౌంటింగ్‌కు అంతా రెడీ అవుతోంది.మొదటి దశ ఎన్నికలు జరిగి దాదాపు నెలన్నర అవుతుంది.

అప్పటి నుండి కూడా వాటిలో ఉన్న ఫలితం ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక చివరి దశ ఎన్నికలు పూర్తి అయ్యాయో లేదో వెంటనే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వచ్చేశాయి.

కేంద్రంలో మళ్లీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఎక్కువ శాతం సర్వేలు చెబుతున్నాయి.కొన్ని సర్వేలు మాత్రం హంగ్‌ వస్తుందని ప్రాంతీయ పార్టీలకు ఆశలు కల్పిస్తున్నాయి.

మోడీ అధికారంలోకి స్పష్టమైన మెజార్టీతో వస్తాడని కొన్ని సర్వేలు చెబుతుంటే ఒకటి రెండు సర్వేలు కాంగ్రెస్‌ కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు అంటూ చెబుతున్నాయి.ఇక ఏపీలో కొత్త సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా ఎక్కువ శాతం సర్వేలు చెబుతుంటే కొన్ని మాత్రం చంద్రబాబు మళ్లీ సీఎం అవుతాడని తాము భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.

కేంద్రం మరియు ఏపీలో ఫలితంపై ఎలాంటి గందరగోళం లేదని కొందరు స్పష్టమైన మెజార్టీతో అక్కడ మోడీ, ఇక్కడ జగన్‌ అంటున్నారు.కాని కొందరు మీడియా వారు మాత్రం అక్కడ హంగ్‌, ఇక్కడ టీడీపీ అంటున్నారు.

ఇక ఎంతో కష్టపడి, ప్రభావితం చేస్తాడనుకున్న పవన్‌కు అసలుకే గతి లేదంటూ సర్వేల్లో ఫలితాలు వచ్చాయంటున్నారు.మరి ఇంతగా వచ్చిన ఈ సర్వేల్లో నిజం ఎంత అనేది మాత్రం ఎవరు చెప్పలేరు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్‌ గెలుపు సాధ్యం కాదంటూ లగడపాటి సర్వే చెప్పుకొచ్చాడు.కాని అనూహ్యమైన గెలుపును తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు ఇచ్చాడు.ఇప్పుడు ఏపీలో మళ్లీ చంద్రబాబు సీఎం అవుతాడని లగడపాటి చెబుతున్నాడు.కాని ఇందులో ఎంత వరకు నిజం, నిజాయితి ఉందో తెలియడం లేదు.

గత ఫలితాలను దృష్టిలో పెట్టుకుని లగడపాటి సర్వే విషయంలో ఎవరు నమ్మకం పెట్టుకోవడం లేదు.

అయితే సామాన్యులు మాత్రం ఈ సర్వేలను పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఎందుకంటే ఎక్కువ శాతం మీడియా సంస్థలు వారికి ఫండింగ్‌ చేసే పార్టీలకే మాత్రమే అధికారం వస్తుందన్నట్లుగా సర్వేలు చేయించుకంటూ వస్తున్నారు.ఆ పార్టీ, ఈ పార్టీ రెండు పార్టీలు గెలుస్తారని వారు వీరు అన్నప్పుడు ఏది నమ్మాలో ఎలా నిర్ణయానికి రావాలని సామాన్యులు అడుగుతున్నారు.
ఏపీలో ఎగ్జిట్‌ పోల్స్‌ తారుమారు అయ్యే అవకాశం ఉందని ఎక్కువ శాతం భావిస్తున్నారు.సర్వేలు శాస్త్రీయంగా జరిగి ఉండవు అని, ప్రభుత్వ పథకాలు దక్కించుకున్నవ వారి వద్దకు వెళ్లి సర్వే చేసిన వారు ప్రశ్నించి ఉండరు అనేది కొందరి భావన.

అందుకే తెలుగు దేశం పార్టీ మాత్ర మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు.మొత్తానికి సర్వేల ఫలితాలు నిజమవుతాయో మరో రెండు రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube