ముసలితనంలో మతిమరపు పెరగకూడదంటే ఏం చేయాలి?

మన బామ్మకి ఈరోజు ఒక విషయాన్ని చెబితే, దాన్ని రేపు అడిగినా, గుర్తు ఉంచుకుంటుంది అన్న నమ్మకం లేదు.అదంతే, వయసు పైబడినా కొద్ది మతిమరుపు పెరిగిపోతూ ఉంటుంది.

 Exercise In Middle Age Will Benefit Memory Power In Old Age-TeluguStop.com

సైన్స్ కూడా ఇదే విషయాన్ని చెప్పింది.ఎందుకంటే వయసు పెరిగిన కొద్ది మన మెమోరి స్టోర్ అయ్యే హిప్పోక్యాంపస్ సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది.

ఈ మతిమరుపుని పూర్తిగా నిలువరించడం కష్టం కావచ్చు కాని, ఎక్కువగా ఉండకుండా మాత్రం చూసుకోగలం.

ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ మెల్ బోర్న్ వారు 1992 సంవత్సరంలో 40-45 మధ్య వయసుగల 387 మంది మహిళలపై ఒక ప్రయోగాన్ని మొదలుపెట్టారు.

ఈ ఇరవైనాలుగు సంవత్సరాల కాలంలో వారి చేత క్రమం తప్పకుండా ప్రతీరోజు వ్యాయమం చేయించారు.వాళ్ళ జీవితశైలిని మార్చేసారు.

ఇన్ని సంవత్సరాల తరువాత వారి జ్ఞాపకశక్తిని పరీక్షిస్తే మంచి ఫలితాలు కనిపించాయి.మరచిపోతారనుకున్న చాలా విషయాలని వారు గుర్తుపెట్టుకున్నారు.

ఈరకంగా 40 సంవత్సరాలు దాటిన నడిజీవితంలోకి వ్యాయామాన్ని చేర్పించడం వలన అద్భుతమైన ఫలితాలు చూసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube