విషాదంగా ముగిసిన విహార యాత్ర!  

Bus Accident At Karnataka - Telugu , Excursion Palaces In Karnataka, Telugu Viral News Updates, Viral In Social Media, విహార యాత్ర

ఈ మధ్యకాలంలో ఎన్నో యాత్రలు విషాదంగానే ముగుస్తున్నాయి.ఇప్పుడు కర్ణాటకలో కూడా అలాంటి ఘటనే జరిగింది.

Bus Accident At Karnataka - Telugu , Excursion Palaces In Karnataka, Telugu Viral News Updates, Viral In Social Media, విహార యాత్ర-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాస్త సమయం స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుదాం అని వెళ్లిన టూరిస్టులకు విషాదమే మిగిలింది.ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.

శనివారం సాయంత్రం మైసూరు నుంచి మంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు చిక్కమగళూరు ఘాట్‌ రోడ్డు అదుపుతప్పి లోయలో పడిపోయింది.

అయితే ఈ ఘటనలో అక్కడిక్కడే 9 మంది మరణించారు.

మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.అక్కడే ఉన్న స్థానికులు రెస్క్యూ టీం సహాయంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బస్సు అతి వేగంగా వెళ్లడం వల్లే ఈ ఘటన జరిగింది అని తెలుస్తుంది.

అయితే ప్రమాదసమయంలో బస్సులో దాదాపు 35 మంది టూరిస్టులు ఉన్నట్టు సమాచారం.వారంతా మైసూర్ కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు.విహార యాత్ర కోసం అని మైసూర్ కు బయలేదరగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

దీంతో వారి విహారయాత్ర విషాదంగా ముగిసింది.

తాజా వార్తలు