శివజ్యోతి చేసిన ఆ ఒక్క తప్పుకు భారీ మూల్యం

న్యూస్‌ యాంకర్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న శివ జ్యోతి బిగ్‌బాస్‌ 3 లో ఒక సామాన్యమైన సెలబ్రెటీగానే ఎంట్రీ ఇచ్చింది.ఈమె కంటే తోపులు చాలా మందే వెళ్లారు.

 Exclusive Bigg Boss Telugu Season 3 Shiva Jyothi Eliminated-TeluguStop.com

కాని మొదటి నుండి కూడా ఎవరితోనూ గొడవ పడకుండా, తనపనేంటో తాను చూసుకుంటూ చాలా కామ్‌గా ఈ అమ్మడు ఆడుతూ వచ్చింది.ఆ కారణంగా ఎక్కువగా నామినేషన్స్‌కు రాలేదు.

నామినేషన్స్‌కు ఎక్కువ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఈమె ఎప్పుడో ఎలిమినేట్‌ అయ్యేది.కొన్ని వారాల తర్వాత ఈమె నామినేట్‌ అయినా ప్రేక్షకులు సేవ్‌ చేస్తూ వచ్చారు.

ఇక రెండు వారాల క్రితం ఎలిమినేషన్‌కు నామినేషన్‌ జరిగిన సమయంలో నెం.1ల వద్ద నిల్చోవాలని బిగ్‌బాస్‌ సూచిస్తే నెం.2 వద్ద వితిక షెరు ఉంటే ఆ స్థానం నాకు కావాల్సిందే అంటూ పట్టుబట్టింది.దాంతో ఇంటి సభ్యులంతా కూడా ఎలిమినేషన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది.

ఆ సమయంలో శివ జ్యోతి మొండి పట్టుదల పట్టడంతో పాటు వితిక ఎలిమినేషన్‌కు కారణం అయ్యింది.ఖచ్చితంగా వితిక ఆ వారం ఎలిమినేషన్‌కు నామినేట్‌ కాకుంటే ఎలిమినేట్‌ అయ్యేది కాదు.

అందుకే ఆమెపై అందరు సీరియస్‌గా ఉన్నారు.అప్పటి వరకు శివ జ్యోతిని బాగానే చూసిన ప్రేక్షకులు ఆమెపై కోపం పెంచుకున్నారు.

Telugu Biggboss, Nagarjuna, Shiva Jyothi, Vithika-

 

ఆ వారం వితిక కంటే స్వల్ప తేడాతో ఎలిమినేషన్‌ నుండి బయట పడింది.అయినా ఆమెపై కోపం అలాగే ఉంది.శివ జ్యోతి ఖచ్చితంగా ఎలిమినేషన్‌ను ఫేస్‌ చేస్తే ఆమెకు చుక్కలు చూపించాలని ప్రేక్షకులు భావిస్తున్నారు.ఈసారి అదే జరిగింది.ఈ వారం శివ జ్యోతి బయటకు వెళ్లి పోబోతుంది.ఆమె ఆటకు ముగింపు పలికింది.

నేటి ఎపిసోడ్‌ను నిన్ననే చిత్రీకరించారు.నిన్న సాయంత్రం షూట్‌ జరిగిన బిగ్‌బాస్‌ షో నుండి శివ జ్యోతి ఎలిమినేట్‌ అయినట్లుగా తెలుస్తోంది.

నేటి ఎపిసోడ్‌లో అది చూపించబోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube