అదిరిపోయే టాటా ప్లే బింజ్‌ ప్లాన్స్... 17 OTTలకు ఒకటే సబ్‌స్క్రిప్షన్‌!

ప్రస్తుతం సినిమా పరిస్థితి పూర్తిగా మారిపోయింది.థియేటర్ కి జనాలు పెద్దగా వెళ్లడం లేదు.

 అదిరిపోయే టాటా ప్లే బింజ్‌ ప్-TeluguStop.com

OTT వచ్చాక అరచేతిలోనే కొత్త సినిమాలు ఆడటంతో వేలకువేలు ఖర్చు చేయడానికి ప్రేక్షకులు ఇష్టపడటం లేదు.రోజుల వ్యవధిలోనే సినిమా హాళ్ల నుంచి నేరుగా మన మొబైళ్లలో ప్రత్యక్షమవుతున్నాయి కొత్త సినిమాలు.

అయితే ఒక్కో సినిమా ఒక్కో ఓటీటీలో వస్తుండడం, వాటికి వేర్వేరుగా సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవడం అనే విషయం ఒకింత భారంగా మారిందనే చెప్పుకోవాలి.దీంతో ఓటీటీలన్నింటినీ ఒక వేదికపైకి తెస్తోంది ప్రముఖ DTH కంపెనీ టాటా ప్లే.

టాటా ప్లే బింజ్‌ పేరిట ఈ సేవలను అందిస్తోంది.

ఇక్కడ ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో ప్రముఖ ఓటీటీలనూ వీక్షించే వెసులుబాటు కలదు.

తాజాగా టాటా ప్లే బింజ్‌లో ఎంఎక్స్‌ ప్లేయర్‌ (MX player) కూడా వచ్చి చేరింది.దీంతో టాటా బింజ్‌లో ఓటీటీల సంఖ్య 17కు చేరింది.తెలుగు, తమిళం, మలయాళం, హిందీ.ఇలా అన్ని భాషాలకు చెందిన సినిమాలు, సీరియళ్లు, వెబ్‌ సిరీస్‌లు అందించే ఓటీటీ వేదికలూ టాటా ప్లే బింజ్‌లో అందుబాటులో ఉన్నాయి.

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, జీ5, సోనీ లివ్‌, వూట్‌ సెలెక్ట్‌, ఎంఎక్స్‌ ప్లేయర్‌, సన్‌ నెక్ట్స్‌, హంగామా ప్లే, ఎరోస్‌ నౌ వంటి పాపులర్‌ ఓటీటీలతో పాటు ఇతర ఓటీటీలు ఇందులో ఉన్నాయి.

Telugu Ott, Chanelle, Mx Tata Binge, Subscribe, Tata Binge-Latest News - Telugu

ఇకపోతే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లు రూ.59 నుంచి స్టార్ట్ అవుతున్నాయి.ఓటీటీల సంఖ్యను బట్టి సబ్‌స్క్రిప్షన్‌ ధరలో మార్పు ఉంటుంది.అన్నీ ఓటీటీలూ కావాలంటే నెలకు రూ.299 చొప్పున చెల్లించాలని టాటా ప్లే బింజ్‌ తన వెబ్‌సైట్‌లో తాజాగా పేర్కొంది.రూ.59 ధరలో మొత్తం మూడు రకాల ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.జీ5 ప్లాన్‌ కావాలంటే కనీసం నెలకు రూ.99 ప్లాన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.హాట్‌స్టార్‌ ఓటీటీతో కూడిన ప్లాన్‌ కావాలంటే రూ.175 చెల్లించాల్సి ఉంటుంది.హాట్‌స్టార్‌, జీ5, సోనీలివ్‌ వంటి అన్ని ప్రముఖ ఓటీటీలూ కావాలంటే రూ.299 చెల్లించాల్సి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube