ఎక్సైటింగ్ అప్డేట్ తో రాబోతున్న నాగ చైతన్య..!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

 Exciting Announcement By Naga Chaitanya-TeluguStop.com

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.శేఖర్ కమ్ముల తెరకెక్కించే ప్రేమ కథలు కొత్తగా మనసుకు హత్తుకునేలా ఉంటాయి.

అందుకే ఈ సినిమా పై కూడా అభిమానులు అంతే అంచనాలు పెట్టుకున్నారు.

 Exciting Announcement By Naga Chaitanya-ఎక్సైటింగ్ అప్డేట్ తో రాబోతున్న నాగ చైతన్య..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో సాయి పల్లవి నటిస్తుండడం వల్ల ఈ సినిమా పక్కా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.

ఎందుకంటే సాయి పల్లవి తన సినిమాలను ఆచి తూచి ఎంచుకుంటుంది.కథ నచ్చితేనే ఎంత పెద్ద సినిమాలో అయినా నటించడానికి ఒప్పుకుంటుంది.కథ నచ్చకపోతే నో చెప్పడానికి కూడా అస్సలు ఆలోచించదు.అందులోను ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా నుండి విడుదలైన ‘సారంగ దారియా’ సాంగ్ రికార్డులు బ్రేక్ చేసింది.ఈ సినిమాకు పవన్ సి హెచ్ సంగీతం అందించారు.అయితే ఈ సినిమా ఏప్రిల్ 16 న విడుదల కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే.పరిస్థితులు చక్కబడిన తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.

అయితే ఇప్పుడు నాగ చైతన్య నుండి ఎక్సైటింగ్ అప్డేట్ రాబోతున్నట్టు ఒక పోస్టర్ విడుదలైంది.ఈ అప్డేట్ రాబోతుందన్న విషయాన్నీ ‘ఆహా’ వారు తెలిపారు.ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నాగ చైతన్య ఆ ఎక్సైటింగ్ అప్డేట్ ను రివీల్ చేయబోతున్నట్టు తెలిపారు.అయితే ఇది లవ్ స్టోరీ అప్డేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

చూడాలి మరి నాగ చైతన్య లవ్ స్టోరీ గురించి అప్డేట్ ఇస్తాడో లేదా వేరే సినిమా గురించి చెప్తాడో.

#Shekar Kammula #@ahavideoIN #Sai Pallavi #Naga Chaitanya #Today

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు