హుజురాబాద్ గెలుపుకు కాంగ్రెస్ వ్యూహంపై ఉత్కంఠ...

తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక హవా నడుస్తున్న విషయం తెలిసిందే.అయితే హుజురాబాద్ బరిలో సీన్ లో బీజేపీ, టీఆర్ఎస్ తప్ప వేరే పార్టీ ఏదీ కనిపించడం లేదు.

 Excitement Over Congress Strategy For Huzurabad Victory Telangana Politics-TeluguStop.com

ప్రజల మనస్సుల్లో కూడా అప్షన్ లుగా బీజేపీ లేక టీఆర్ఎస్ అన్న విధంగా ఉంది.అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపు ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పవచ్చు.

అయితే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్నా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులుగా నియామకం తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో ఒకింత ఊపు వచ్చిందని చెప్పవచ్చు.అయితే బీజేపీ హుజురాబాద్ లో పాదయాత్ర వ్యూహాన్ని అమలు చేస్తుండగా , టీఆర్ఎస్ దళిత బంధు వ్యూహాన్ని అమలు చేస్తోంది.

 Excitement Over Congress Strategy For Huzurabad Victory Telangana Politics-హుజురాబాద్ గెలుపుకు కాంగ్రెస్ వ్యూహంపై ఉత్కంఠ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu #telanganacongress, Congress Mp Revanth Reddy, Huzurabad By Poll, Telangana Politics-Political

కాని కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు.హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.అయితే ఓ ఛానల్ డిబేట్ లో భాగంగా హుజురాబాద్ ను కాంగ్రెస్ పార్టీ సవాల్ గా తీసుకోవడం లేదని ప్రకటించి హుజురాబాద్ ఉప ఎన్నిక పట్ల కాంగ్రెస్ వైఖరిని మనం అర్ధం చేసుకోవచ్చు.అధికారికంగా ఒక్క కమిటీని కూడా కాంగ్రెస్ ఏర్పాటు చేయకపోయినా గెలుపు పట్ల నమ్మకం కలిగి ఉన్నారా లేరా అన్నది మనకు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

#COngressMP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు