ఓహో ఇదంతా రాబిన్ శర్మ స్కెచ్ నా ? టీడీపీ ట్రాక్ లో పడినట్టే గా ? 

Excitement In The Party Due To Tdp Political Strategist Robin Sharma

గత కొద్దిరోజులుగా ఏపీ లో చోటుచేసుకున్న పరిణామాలతో తెలుగుదేశం పార్టీ యాక్టీవ్ అయ్యింది.పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం గతంతో పోలిస్తే మరింత ఎక్కువైంది.

 Excitement In The Party Due To Tdp Political Strategist Robin Sharma-TeluguStop.com

మొన్నటి వరకు వైసిపి ప్రభుత్వం పై ను టార్గెట్ చేసుకుని వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ, పోరాటం చేసేందుకు అంతగా ఆసక్తి చూపించని నాయకులు ఇప్పుడు యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.అలాగే టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.ఈ వ్యవహారంలో పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు.అయితే దీనిని రాజకీయంగా ఉపయోగించుకుని లాభం పొందడం లో టిడిపి అనుకున్న మేరకు సక్సెస్ అయింది.తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరగడం, దీనికి నిరసనగా టిడిపి అధినేత చంద్రబాబు 36 గంటల పాటు నిరసన దీక్షకు దిగడం ఇవన్నీ పార్టీ కి బాగా కలిసి వచ్చాయి.
  అసలు ఈ పరిణామాలన్నీ చోటు చేసుకోవడానికి,  టిడిపి కి ఇంతగా మైలేజ్ రావడానికి కారణం మాత్రం ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ అట.ఆయన వ్యూహం ప్రకారమే చంద్రబాబు లోకేష్ గత కొంతకాలంగా నడుచుకుంటున్నారు.దీనికోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రాబిన్శర్మ కోసం ప్రత్యేక కార్యాలయాన్ని కేటాయించారు.

గత ఆరు నెలలుగా ఆయన అక్కడే మకాం వేసి అనేక సర్వేలు చేస్తూ, టిడిపి ఏ విధంగానాల్లోకి తీసుకెళ్లాలని విషయంపైనే దృష్టి పెట్టారు.ఆయన సలహాలు, సూచనలతో లోకేష్ గత కొంతకాలంగా  ఏపీలో రాజకీయ ఉద్యమాలు చేపట్టడం,  పరామర్శలు చేస్తూ పార్టీ నాయకులకు అండగా నిలబడడం, ఇవన్నీ రాబిన్ శర్మ వ్యూహాలేనట.
 

 Excitement In The Party Due To Tdp Political Strategist Robin Sharma-ఓహో ఇదంతా రాబిన్ శర్మ స్కెచ్ నా టీడీపీ ట్రాక్ లో పడినట్టే గా  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Amit Sha, Ap Cm Jagan, Ap Politcs, Cbn, Chandrababu, Jagan, Nara Lokesh, Pattabhi, Rabin Sharma, Robin Sharma Strategies, Tdp, Tdp Political Strategist, Ysrcp-Telugu Political News

గత కొంతకాలంగా ఏపీలో డ్రగ్స్ వ్యవహారం చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం జగన్ అని , టిడిపి అదే పనిగా విమర్శలు చేయడం, పట్టాభి తో జగన్ ను తిట్టించడం ఇవన్నీ రాబిన్ శర్మ సూచనలు తోనే జరిగాయట.పట్టాభి జగన్ ను దూషించిన దగ్గర నుంచి చోటుచేసుకున్న పరిణామాలు , చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం , రాష్ట్రపతితో భేటీ అవ్వడం, అమిత్ షా కు లేఖ రాయడం ఇవన్నీ రాబిన్ శర్మ పొలిటికల్ స్ట్రాటజీ లో భాగంగా చోటు చేసుకున్న పరిణామాలే అనేది టీడీపీ కీలక నాయకుల ద్వారా తెలుస్తోంది.

#AP Politcs #Rabin Sharma #AP CM Jagan #Pattabhi #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube