ఉప్పు అధికంగా తింటే ఏమవుతుందో తెలుసా?  

  • ఏ వంటకం చేసిన ఉప్పు తప్పనిసరిగా ఉండాల్సిందే. కొంత మంది ఉప్పు తక్కువగా తింటారు. అలాగే కొంతమంది ఉప్పును కాస్త ఎక్కువగా తింటూ ఉంటారు. ఆలా ఉప్పు ఎక్కువగా తినటం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. మన శరీరం సక్రమంగా పనిచేయటానికి ఉప్పు అవసరమే. కానీ మోతాదుకు మించి ఉప్పును వాడితే అనర్ధాలు జరుగుతాయి. ఉప్పు ఎక్కువగా తినటం వలన కలిగే ఆరోగ్య సమస్యలు గురించి తెలుసుకుందాం.

  • ఉప్పును ఎక్కువగా తీసుకోవటం వలన రక్తపోటు పెరుగుతుంది. తద్వారా గుండెజబ్బులు వస్తాయి. ఉప్పు అధికంగా తినటం వలన రక్తంలో సోడియం శాతం పెరుగుతుంది. దీని కారణంగా కిడ్నీలలో అసౌకర్య ఏర్పడి శరీరం నుండి నీటిని బయటకు పంపటం కష్టం అవుతుంది. దీని కారణంగా రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి రక్తపోటు వస్తుంది. ఇది క్రమంగా రక్తపోటు గుండె, బ్రెయిన్, కిడ్నీ విఫలత మొదలగు వ్యాధులకు కారణమవుతుంది.

  • Excessive Salt Consumption Aid-

    Excessive Salt Consumption Aid

  • శరీరంలో ఉప్పు ఎక్కువగా ఉన్నప్పుడు ఉప్పు రక్తంలో కలవటానికి నీరు అధికంగా అవసరం అవుతుంది. అందువల్ల విపరీతమైన దాహం కలుగుతుంది. ఉప్పు ఎక్కువగా ఉండుట వలన శరీరంలో నీటి శాతం తగ్గి శరీర భాగాలు ఉబ్బుతాయి. ఉప్పు అధికం కాగానే కిడ్నీలు మూత్రాన్ని ఆపేసి, ఆ నీటిని ఉప్పు కోసం వినియోగిస్తాయి. దాంతో మూత్రం పోసేటప్పుడు మంట వస్తుంది.

  • ఈ చిహ్నాలు కనపడితే తప్పనిసరిగా శరీరంలో ఎక్కువగా ఉప్పు ఉందని అర్ధం చేసుకోవాలి. దీనికి పరిష్కారంగా ప్రతిరోజూ నీటిని అధికంగా తాగడం, ఉప్పు అధికంగా వుండే ప్యాకేజ్ ఆహారాలు మానటం చేయాలి. తాజా పండ్లు, కూరలు తినాలి.