ఈ పండ్ల‌ను అధికంగా తీసుకుంటే బ‌రువు పెర‌గ‌డం ఖాయం!

ఇటీవ‌ల కాలంలో వెయిట్ లాస్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నించే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది.మారిన జీవ‌న శైలి, ఆహార‌పు అల‌వాట్లు, మ‌ద్య పానం, ఒత్తిడి, ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు, థైరాయిడ్‌, శ‌రీరానికి శ్ర‌మ లేక‌పోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల బ‌రువు పెరిగిపోతుంటారు.

 Excessive Intake Of These Fruits Is Sure To Increase The Weight-TeluguStop.com

దాంతో పెరిగిన బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక తిప్ప‌లు ప‌డుతుంటారు.వ్యాయామాలు చేస్తారు, డైట్ ఫాలో అవుతారు, ఇత‌ర ఆహార‌ల‌కు బ‌దులు పండ్ల‌ను అధికంగా తీసుకుంటారు.

అయితే బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నించే వారు కొన్ని కొన్ని పండ్ల‌తో జాగ్ర‌త్తగా ఉండాలి.

 Excessive Intake Of These Fruits Is Sure To Increase The Weight-ఈ పండ్ల‌ను అధికంగా తీసుకుంటే బ‌రువు పెర‌గ‌డం ఖాయం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లేదంటే వెయిట్ లాస్ అవ్వ‌డం కాదు పెరుగుతార‌ని నిపుణులు చెబుతున్నారు.

మ‌రి ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.మామిడి పండ్లు.

ప్ర‌స్తుత స‌మ్మ‌ర్‌లో ఎక్క‌డ చూసినా ఇవే ద‌ర్శ‌న‌మిస్తుంటాయి.అయితే మామిడి పండ్ల‌లో క్యాల‌రీలు అధికంగా ఉంటాయి.

అందువ‌ల్ల‌, బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు మామిడి పండ్ల‌కు దూరంగా ఉండ‌ట‌మే మేలు.

అలాగే సపోటా పండు కూడా వెయిట్ గెయిన్ అయ్యేందుకు స‌హ‌క‌రిస్తుంది.

ఈ రుచికరమైన పండ్లలో క్యాలరీల కంటెంట్ చాలా అధికంగా ఉంటుంది.అందుకే వెయిట్ లాస్ అవ్వాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నించే వారు స‌పోటా పండ్లను ఎంత త‌క్కువ తీసుకుంటే అంత మంచిది.

విట‌మిన్స్, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక‌ పోష‌కాలు ఉండే పండ్ల‌లో అవ‌కాడో కూడా ఒక‌టి.

Telugu Avocado, Banana, Benefits Of Fruits, Fruits, Good Health, Health, Health Tips, Latest News, Mango, More Calories Fruits, Sapota, Weight Gain, Weight Gaining Fruits, Weight Loss, Weight Loss Tips-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

అయితే పోష‌కాలే కాదు.క్యాల‌రీలు కూడా ఇందులో అధికంగానే ఉంటాయి.అందుకే బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు అవ‌కాడో పండ్ల‌ను కాస్త త‌క్కువ‌గా తీసుకోవాలి.

సూపర్ ఫుడ్ గా చెప్పుకునే అర‌టి పండు కూడా బ‌రువు పెరిగేలా చేస్తుంది.అర‌టి పండులో బోలెడ‌న్ని పోష‌కాలతో పాటు క్యాల‌రీలూ ఎక్కువ‌గా ఉంటాయి.కాబ‌ట్టి, వెయిట్ లాస్ అవ్వాల‌ని ట్రై చేస్తున్న వారు రోజుకు ఒక అర‌టి పండుకు మించి తిన‌కూడ‌దు.

#Health #Fruits #Banana #Health Tips #Good Health

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు