అతిమద్యం వలన తలనొప్పి కలిగితే ఏం చేయాలి?  

  • మద్యం అతిగా తాగితే మత్తు ఎలాగో వస్తుంది. దాంతోపాటు తలనొప్పి కూడా వచ్చేస్తుంది అప్పుడప్పుడు. ఆ నొప్పి భరించలేనట్టుగా ఉంటుంది. దీన్నే మందుబాబుల భాషలో హ్యాంగ్ ఓవర్ అని అంటారు. అలాంటి సమయంలో ఉపశమనం ఎలా పొందాలో ఇప్పుడు చూడండి.

  • * మొదట చేయాల్సిన పని, నీళ్ళు బాగా తాగడం. సాధ్యమైనంత వరకు, ఇక చాలు అనిపించేంతలా నీళ్ళు తాగండి.

  • * మంచినీరు మాత్రమే కాదు, పండ్ల రసం, ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్, స్పోర్ట్స్ డ్రింక్ తాగండి.

  • * హ్యాంగ్ ఓవర్ లో ఉన్నప్పుడు కెఫైన్ ఉండే పదార్థాలు, ముఖ్యంగా కాఫీ అస్సలు తీసుకోవద్దు. అలాంటి సమయంలో ఒంట్లో కెఫైన్ పడితే, తలనొప్పి ఇంకా పెరుగుతుందే తప్ప, తగ్గదు.

  • * ఉడకబెట్టిన గుడ్లు తినండి. అమినో ఆసిడ్స్ కలిగిన గుడ్లు, మద్యం వలన ఒంట్లో చేరిన టాక్సిన్స్ ని బయటకు తెస్తాయి. దాంతో హ్యాంగోవర్ తగ్గుతుంది.

  • * పొటాషియం ఎక్కువ ఉండే పదార్థాలు తినాలి. అంటే, అరటిపండు లాంటివి అన్నమాట.

  • * కాసేపు నిద్రతీస్తే అదే సర్దుకుంటుంది. ఓపిక ఉండి, కాసేపు అలా నడిస్తే ఇంకా బెటర్.