ఎల్‌ఐసీ నుంచి ఎక్సలెంట్ స్కీమ్.. ప్రతీ రోజు రూ.29 చెల్లిస్తే చాలు.. మెచురిటీ తర్వాత ఎంత ఇస్తారంటే?

మన దేశంలోనే అతి పెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ.ఎక్కువ మంది పాలసీదారులున్న ఈ సంస్థను భారతీయులు ఇప్పటికీ ఆదరిస్తున్నారు.

 Excellent Scheme From Lic Rs 29 Per Day Is Enough How Much Will Be Given After Maturity-TeluguStop.com

కాగా, భారతీయ జీవిత బీమా సంస్థ ప్రజలే కేంద్రంగా వినూత్న పథకాలను అందుబాటులోకి తీసుకొస్తుంటుంది.తాజాగా ప్రజల కోసమే ఎక్సలెంట్ స్కీమ్ తీసుకొచ్చింది.

అదేంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే.

 Excellent Scheme From Lic Rs 29 Per Day Is Enough How Much Will Be Given After Maturity-ఎల్‌ఐసీ నుంచి ఎక్సలెంట్ స్కీమ్.. ప్రతీ రోజు రూ.29 చెల్లిస్తే చాలు.. మెచురిటీ తర్వాత ఎంత ఇస్తారంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎల్‌ఐసీ ‘ఆధార్ శిలా’ అనే సరికొత్త పథకాన్ని ఇటీవల ప్రారంభించింది.

ఈ పథకం ద్వారా మహిళలకు స్వావలంబన లభిస్తుందని ఎల్ఐసీ పేర్కొంటోంది.మహిళా సాధికారిత కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నాయి.

ఈ క్రమంలోనే ఎల్‌ఐసీ మహిళలే కేంద్రంగా ఈ స్కీమ్‌ను లాంచ్ చేసింది.ఈ పథకం ద్వారా మహిళలు తక్కువ మొత్తంలోనే పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తాన్ని పొందొచ్చు.

అయితే, అందుకు సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కంపల్సరీ పాటించాలి.ఈ స్కీమ్‌కు ఎనిమిది నుంచి యాభై యాదు ఏళ్ల వయసు మధ్య ఉన్న మహిళలు మాత్రమే అర్హులు.

కాగా, వారు ఇందులో చేరిన క్రమంలో ప్రతీ రోజు 29 రూపాయలు చొప్పున చెల్లించాలి.అనగా ఏడాదికి గాను రూ.10,585 అవుతుంది.

Telugu #lic, 20 Years, 29 Rupees Per Day, About Lic Aadhar Shila Scheme, Bheema, Double Maturity Amount, Lic Excellent Scheme, Lic Scheme For Women, Women Empowerment Scheme-Latest News - Telugu

ఈ స్కీమ్ ద్వారా డబ్బులు కట్టే పాలసీహోల్డర్‌కు వారి చెల్లించే మనీకి రాబడి హామీతో పాటు ఎల్‌ఐసీ ప్రొటెక్షన్ కవరేజ్ అందుతుంది.ప్రతీ రోజు రూ.29 చొప్పున కట్టే అమౌంట్‌కు 4.5 శాతం పన్ను కలిపితే రూ.10,959 కడితే, వరుస 20 ఏళ్ల పాటు చెల్లింపులు చేస్తే మొత్తం రూ.2,14,696 చెల్లించాలి.ఈ అమౌంట్ మెచురిటీ తర్వాత డబుల్ అవుతుంది.

అంటే కట్టిన అమౌంట్‌కు అంత అమౌంట్ యాడ్ అవుతుంది.ఈ స్కీమ్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవారు దగ్గర్లోని మీ ఎల్ఐసీ ఏజెంట్ లేదా సమీప ఎల్ఐసీ బ్రాంచ్‌ను సంప్రదించొచ్చు.

ప్రీమియంను మంత్ వైస్, లేదా మూడెనెలలకోసారి, ఆరు నెలలకోసారి చెల్లించుకోవచ్చు.

#AadharShila #DoubleMaturity #Scheme #Scheme #Rupees

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు