మీకు తెలుసా : మందు ఎంత తాగినా బీరకాయలు తింటే చావరట  

Excellent Health Benefits Of Ridge Gourd - Telugu , B6, , Health Benefits, Health Issues, Health Tips, R, Ridge Gourd

ఆల్కహాల్‌ ఎక్కువ తాగేవారి లివర్స్‌ నాశనం అవ్వడంతో పాటు పలు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి.పెద్ద ఎత్తున మద్యం తాగే వారి మరణాలు ఈమద్య కాలంలో సంభవిస్తున్నాయి.

Excellent Health Benefits Of Ridge Gourd - Telugu , B6, , Health Benefits, Health Issues, Health Tips, R, Ridge Gourd-Latest News-Telugu Tollywood Photo Image

దీర్ఘకాలం పాటు ఆల్కహాల్‌ను తీసుకునే వారు చావుకు దగ్గర పడ్డట్లే అంటూ వైధ్యులు చెబుతూ ఉంటారు.వారు తీసుకునే ఆల్కహాల్‌ అనేది మెల్లగా వారి శరీరంలోని అవయవాలను దహించి వేస్తూ ఉంటుంది.

తద్వారా వారి జీవితం చివరి అంకంలోకి వచ్చినట్లుగా డాక్టర్లు గుర్తిస్తారు.

ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకునే వారు మొదటి నుండి కూడా బీరకాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వారి చావు కొన్ని సంవత్సరాలు అయినా ఆలస్యం అవుతుందని డాక్టర్లు అంటున్నారు.

బీరకాయల వల్ల కలిగే ప్రయోజనాలపై తాజాగా అమెరికాకు చెందిన ఒక యూనివర్శిటీ అధ్యయనం చేసింది.ఆ ఆధ్యయనంలో వెళ్లడయిన విషయాలు వారికి కూడా ఆశ్చర్యంగా ఉందట.ముఖ్యంగా బీరకాయ వల్ల లివర్‌కు కలిగే ప్రయోజనాల గురించి వారు అవాక్కయ్యారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనం వచ్చింది.

బీరకాయలో ఉండే పోషకాలు కాలేయం దెబ్బ తినకుండా చూస్తుంది.పాక్షికంగా పాడయిన కాలేయంను బీరకాయలతో పరిరక్షించవచ్చు అంటూ వారు చెబుతున్నారు.బీరకాయలోని మాంగనీస్‌ జీర్ణక్రియ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచి పలు అనారోగ్య సమస్యల నుండి కూడా కాపాడుతుందని వైధ్యులు నిర్థారించారు.

బీరకాయలను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కంటి సమస్యలు కూడా తొలగి పోవడంతో పాటు మంచి చూపును కూడా పొందుతారు.

బీరకాయల్లో బి6 ఎనీమియ ఇంకా పలు ప్రోటీనులు, విటమిన్లు పీచు పదార్థాలు శరీరాన్ని రోగ నిరోధక శక్తి పెంచే విధంగా పని చేస్తాయి.మొత్తానికి బీరకాయలు రెగ్యులర్‌గా తినేవారు బీరకాయలు తినని వారి కంటే ఓ రెండు మూడు సంవత్సరాలు అదనంగా బతికే ఛాన్స్‌ ఉంది.మరెందుకు ఆలస్యం ఆరోగ్యప్రధాయినీ అయిన బీరకాయలను వెంటనే తినడం ప్రారంభించండి.

తాజా వార్తలు