అన్నంత పనిచేసిన ట్రంప్.. 'TRUTH Social' పేరిట సొంత సోషల్ మీడియా, వచ్చే నెలలో అందుబాటులోకి..!!

సోషల్ మీడియాలో చురుగ్గా వుండే డొనాల్డ్ ట్రంప్‌కు అవి చేతిలో లేకపోవడం పెద్ద లోటుగానే వుంది.అధికారంలో వున్నప్పుడు ప్రతి విషయాన్ని ఈ మాధ్యమాల సాయంతో ప్రజలతో పంచుకునేవారు ట్రంప్.

 Ex Us President Donald Trump Announces Plans To Launch New Social Network Truth-TeluguStop.com

కానీ ఎప్పుడైతే క్యాపిటల్ భవనంపై దాడి జరిగిందో నాటి నుంచి సోషల్ మీడియా దిగ్గజాలు ఆయనపై బ్యాన్ వేశాయి.ట్విట్టర్ ట్రంప్‌పై శాశ్వత నిషేధం విధించగా.

ఫేస్‌బుక్ 2023 వరకు బ్యాన్ వేసింది.దీంతో నాటి నుంచి ట్రంప్‌ చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఈ మెయిల్స్‌, బ్లాగ్ సహా కొన్ని ఫ్లాట్ ఫామ్‌లతో కొద్దిరోజులు నెట్టుకొచ్చినా.అది అంతగా ఫలితాన్ని ఇవ్వలేదు.

కొద్దిరోజుల క్రితం ప్రముఖ వీడియో షేరింగ్ ఫ్లాట్‌ఫాం రంబుల్‌లో డొనాల్డ్ ట్రంప్ చేరారు.అయితే ఇది కూడా ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా లేదనే టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో సొంతంగా ఓ సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను ప్రకటించారు ట్రంప్.దీని పేరు ట్రూత్ సోషల్ (TRUTH Social).నవంబర్‌లో ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్.తన కార్యకలాపాలను ప్రారంభించనుంది.

‘‘ ట్రూత్ సోషల్ ’’ పేరుతో అందుబాటులోకి రానున్న ఈ ప్లాట్‌ఫామ్‌ను ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (టీఎంటీజీ) ప్రమోట్ చేస్తుంది.ఇప్పటికే అందుబాటులో వున్న ప్రముఖ కంపెనీలకు చెందిన సోషల్ మీడియా నెట్‌వర్క్‌కు పోటీగా దీనిని తీసుకుని రాబోతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను స్థాపించడంపై దృష్టి పెట్టారు.10 నెలల్లో దానికి రూపకల్పన చేశారు.గతంలో ఆయన `ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ డొనాల్డ్ జె ట్రంప్ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

అమెరికన్ స్టాక్ మార్కెట్‌లో దీన్ని లిస్టింగ్‌లోకి తీసుకుని రావడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఇప్పటికే లిస్ట్ అయిన బ్లాంక్ ఛెర్రి కంపెనీ డిజిటల్ అక్విజిషన్ కార్పొరేషన్‌లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్‌ను విలీనం చేయనున్నారు.ప్రస్తుతం ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ విలువ 875 మిలియన్ డాలర్లు.

దీనికి అదనంగా మరో 825 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నారు.

తొలుత ఈ ఏడాది జూలైలో ‘GETTR’ పేరిట ట్రంప్ కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మాదిరిగా కాకుండా భావ ప్రకటనకు ‘GETTR’లో పూర్తి స్వేచ్ఛ ఉంటుందని టీమ్ డొనాల్డ్ ట్రంప్ వెల్లడించింది.ట్రంప్ మాజీ సీనియర్ సలహాదారు జాసన్ మిల్లెర్ ఈ యాప్ వెనుక కీలకపాత్ర పోషించారు.

దీని కోసం ఆయన తన పదవి నుంచి కూడా తప్పుకున్నారు.

Telugu Donaldtrump, Gettr, Joe Biden, Platm Rumble, Trump-Telugu NRI

కాగా, అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాట్ నేత జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం జనవరి 6 (బుధవారం)న యూఎస్ కాంగ్రెస్.క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.బారికేడ్లను దాటుకుని వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.వారిని శాంతింపజేసేందుకు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది.

దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయిన ఈ ఘటనకు సంబంధించి ఎన్నో విచారణ కమీటీలు దర్యాప్తు చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube