పెంపుడు కుక్క మరణం.. నిజమైన మిత్రుడిని కోల్పోయానంటూ ఒబామా ఉద్వేగం

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పెంపుడు కుక్క ‘‘బో’’ క్యాన్సర్‌తో కన్నుమూసింది.ఒబామా తన కుమార్తెలు మాలియా, సాషాకు 2008 ఎన్నికల తర్వాత కుక్కపిల్లను ఇస్తానని వాగ్థానం చేశారు.

 Ex Us President Barack Obamas Family Dog Bo A Star Of The White House Dies-TeluguStop.com

ఇచ్చిన మాట ప్రకారం.అధ్యక్షుడిగా గెలిచి వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన వెంటనే ఒబామా కుటుంబంలో ‘‘బో’’ ఒక భాగమైంది.

శ్వేతసౌధంలో కుక్కతో ఆడుకుంటున్న ఫోటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.తాజాగా బో మరణం పట్ల ఒబామా ఇలా ట్వీట్ చేశారు.

 Ex Us President Barack Obamas Family Dog Bo A Star Of The White House Dies-పెంపుడు కుక్క మరణం.. నిజమైన మిత్రుడిని కోల్పోయానంటూ ఒబామా ఉద్వేగం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

‘‘ ఈరోజు మా కుటుంబం నిజమైన స్నేహితుడిని, నమ్మకమైన సహచరుడిని కోల్పోయింది అని పేర్కొన్నారు.తాను అధ్యక్షుడిగా వున్న రోజుల్లో వైట్ హౌస్‌ కారిడార్‌లో ‘‘బో’’ తో ఆడుకుంటున్న ఫోటోను ఈ సందర్భంగా ఒబామా షేర్ చేశారు.

ఒక దశాబ్ధానికి పైగా, ‘‘బో’’ తమ జీవితంలో స్థిరమైన, సున్నితమైన ఉనికి అని ప్రస్తావించారు.మా మంచిలో, చెడులో ప్రతి సందర్భంలో ‘‘బో’’ వుందని మాజీ అధ్యక్షుడు గుర్తుచేసుకున్నారు.

వైట్‌హౌస్‌లో వున్నన్ని రోజులు ఎవరికీ హానీ చేయలేదని.వేసవిలో స్విమ్మింగ్ పూల్‌లో దూకేదని, తన డిన్నర్ టేబుల్ చుట్టూ తిరిగేదని ఒబామా అన్నారు.

‘‘బో’’ బ్లాక్ అండ్ వైట్ పోర్చుగీస్ జాతికి చెందిన వాటర్ డాగ్.దీనిని సెనేటర్ ఎడ్వర్డ్ కెన్నడీ .ఒబామాకు బహుమతిగా అందజేశారు.ఒబామా హయాంలో వైట్‌హౌస్‌లోని అన్ని ముఖ్య కార్యక్రమాల్లో ‘‘బో’’ సందడి చేసేది.

వార్షిక ఈస్టర్ ఎగ్ రోల్‌ సమయంలో పోప్‌ను కలవడం, ఆసుపత్రిలో పిల్లలతో ఆడుకోవడంతో పాటు అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో సైతం ప్రయాణించింది.ఒబామా సతీమణి మిచెల్ ఒబామా కూడా ‘‘బో’’ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఒక కుటుంబసభ్యుడిగా ‘‘బో’’ను తాము చాలా మిస్ అవుతామని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.ఆటలు, రకరకాల విన్యాసాలతో తమకు ఆనందం పంచినందుకు ‘‘బో’’కు మిచెల్ కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, ‘‘బో’’ను కిడ్నాప్ చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించడం అప్పట్లో కలకలం సృష్టించింది.నార్త్ డకోటాలోని డికిన్సన్‌కు చెందిన స్కాట్‌ డి.స్టాకర్ట్‌ అనే వ్యక్తి ఓ ట్రక్కులో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి నింపుకుని న్యూయార్క్‌ మీదుగా వాషింగ్టన్‌ చేరుకున్నాడు.అతణ్ణి గుర్తించిన పోలీసులు హాంప్టన్‌ వద్ద అరెస్ట్‌ చేశారు.

విచారణ సమయంలో తాను ఒబామా పెంపుడు కుక్కను కిడ్నాప్ చేసేందుకు వచ్చానని చెప్పడంతో అధికారులు ఖంగుతిన్నారు.నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్న సీక్రేట్‌ సర్వీస్‌ ఏజెంట్లు.

వాహనం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

#White House #SenatorEdward #Dies #BlackAnd #Michelle Obama

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు