ట్రంప్ సలహా దారుడికి 47 నెలల జైలు శిక్ష..ఎందుకంటే..??  

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాజీ సలహా దారుడికి అమెరికా కోర్టు 47 నెలల జైలు శిక్ష విధించింది. గత ఎన్నికల్లో తానూ మేనేజర్ గా పని చేసిన సమయంలో పాల్ మానాఫోర్ట్‌ కొన్ని వేల కోట్ల డాలర్లు అక్రమంగా సంపాదించిన కేసులో అతడిని దోషిగా తేల్చింది. దాంతో గురువారం ఆయనకు ఈ శిక్షని ఖరారు చేసింది కోర్టు.

  • 2016 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తుకు అమెరికా ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. అమెరికా న్యాయ విభాగానికి చెందినా స్పెషల్ కౌన్సిల్ రాబర్ట్ ముల్లర్ తన విచారణ సమయంలో మానా ఫోర్ట్ అవినీతి వెలికి తీశారు.

  • Ex-Trump Official Manafort Sentenced To 47 Months In Prison-Eight Felony Crimes Ex-trump Paul

    Ex-Trump Official Manafort Sentenced To 47 Months In Prison

  • అయితే శిక్ష ఖరారు సమయంలో కోర్టులో మాట్లాడిన మానా ఫోర్ట్ గత రెండు సంవత్సరాలు తన జీవితంలో అత్యంత క్లిష్టమైన, వృత్తిపరంగా , ఆర్ధికంగా ఒడిదొడుగులు ఎదుర్కున్నానని , శిక్ష ఖరారు చేస్తున్న సమయంలో తనపై దయ చూపాలని కోరారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ చేసిన తప్పులకు పశ్చాత్తాప పడకపోవడం చూసి ఆశ్చర్య పోయారు. దాంతో అతడికి 47 నెలల జైలు శిక్షని విధిస్తూ తీర్పు చెప్పారు.