టాలీవుడ్ హీరోయిన్ మహారాష్ట్రలో ఎంపీ అయ్యింది!  

మహారాష్ట్రలో ఎంపీగా గెలిచిన ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్. .

Ex Tollywood Heroine Become Lok Sabha Mp-

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా రాణించిన వారు తరువాత రాజకీయాలలోకి వెళ్లి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు.ఈ వరుసలో సీనియర్ హీరోయిన్స్ నుంచి నేటి తరం హీరోయిన్స్ వరకు చాలా మంది ఉన్నారు.ఇప్పటికే గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా కొంత మంది హీరోయిన్స్ రాజకీయాలలో వివిధ పార్టీలలో కీలకంగా వ్యవహరిస్తున్నారు..

Ex Tollywood Heroine Become Lok Sabha Mp--Ex Tollywood Heroine Become Lok Sabha MP-

ఇదిలా ఉంటే తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా నటించి, తరువాత ఐటెం సాంగ్స్ కూడా చేసిన నవనీత్ కౌర్ అందరికి తెలిసే ఉంటుంది.ఆమె కెరియర్ లో ఎక్కువగా చిన్న సినిమాలే చేసింది.స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

ఇదిలా ఉంటే మహారాష్ట్ర ఎమ్మెల్యే రవి రాణాని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైనా ఈ భామ చాల కాలం తర్వాత మరల మీడియా ముందుకి వచ్చింది అయితే ఈ సారి ఆమె రాజకీయ నాయకురాలిగా కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.భర్త అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లో ప్రవేశించిన నవనీత్ కౌర్ మహారాష్ట్రలో అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసి శివసేన అభ్యర్థిపై 30 వేల మెజారిటీతో గెలుపొందింది.భర్త రాణా యువ స్వాభిమాన్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు.కౌర్ కూడా అదే పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి లోక్ సభలోకి ఎంటర్ అవుతుంది.