వైసీపీలో భారీగా చేరికలు! స్థానిక పోరు ముందు కొత్త ఉత్సాహం  

Ex Tdp Janasena Leaders Joins Ycp - Telugu Ap Politics, Ex Mla\\'s Join Ysrcp, Janasena, Local Body Elections, Tdp, Ys Jagan, Ysrcp

స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యం అన్ని పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ ని ప్రయోగిస్తూ నేతలని తమ పార్టీలలో చేర్చుకుంటున్నాయి.టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలలో చాలా నియోజకవర్గాలలో చేరికలు కనిపిస్తున్నాయి.

 Ex Tdp Janasena Leaders Joins Ycp

జనసేనలో చేరడానికి యువత ఉత్సాహం చూపిస్తూ ఉంటే.టీడీపీ, వైసీపీ పార్టీలలో పాత కాపులు అటు ఇటు తిరుగుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముందు వైసీపీకి ఉత్త ఉత్సాహం అందించే విధంగా కీలక నేతలు టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి చేరిపోయారు.విశాఖలో పట్టు కోసం చూస్తున్న వైసీపీకి మరింత బలం చేకూర్చే విధంగా అక్కడ కీలక నేతలుగా ఉన్న మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య జనసేనని వీడి వైసీపీలోకి చేరిపోయారు.

వైసీపీలో భారీగా చేరికలు స్థానిక పోరు ముందు కొత్త ఉత్సాహం-Political-Telugu Tollywood Photo Image

అలాగే టీడీపీని వీడిన రెహమాన్, కాంగ్రస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ వైసీపీలో చేరిపోయారు.విశాఖ తర్వాత రాయలసీమ జిల్లాలలో వైసీపీలో ఎక్కువగా చేరికలు కనిపించాయి.

పులివెందులలో దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి ప్రత్యర్ధిగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి వైసీపీలో చేరిపోయారు.అలాగే బాలకృష్ణ స్నేహితుడుగా టీడీపీ పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న కదిరి బాబూరావు కూడా వైసీపీ కండువ కప్పుకున్నారు.

అదే దారిలో టీడీపీలో తమ తండ్రి కాలం నుంచి ఉన్న రామసుబ్భారెడ్డి కూడా వైసీపీ గూటికి చేరబోతున్నాడు అని తెలుస్తుంది.మొత్తానికి ఈ చేరికల ద్వారా రాయలసీమలో టీడీపీ మొత్తానికి ఖాళీ అయిపోతే.

విశాఖలో టీడీపీ, జనసేన పార్టీలకి ఎన్నికల ముందు కాస్తా ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది అని చెప్పాలి

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ex Tdp Janasena Leaders Joins Ycp Related Telugu News,Photos/Pics,Images..

footer-test