వకీల్ సాబ్ పై సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ ప్రశంసలు

పింక్ రీమేక్ గా తెలుగులో పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో తెరకెక్కిన వకీల్ సాబ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఒరిజినల్ సోల్ మిస్ కాకుండా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి తెరకెక్కించిన వకీల్ సాబ్ సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి ప్రశంసలు సొంతం చేసుకుంది.

 Ex Supreme Court Chief Justice Heaps Praises On Pawan Kalyan, Tollywood, Vakeel-TeluguStop.com

మహిళా ప్రేక్షకులు సినిమాకి నీరాజనాలు పట్టారు.ఇక ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది.

అద్బుతమైన కథ, కథనంతో పాటు పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ కూడా అంతే అద్బుతంగా ఉందని కొనియాడారు.వకీల్ సబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా నటిస్తున్నట్లు అనిపించలేదని, ఒరిజినల్ గా తాను ఎలా ఉంటాడో అలాంటి క్యారెక్టరైజేషన్ తో మెప్పించాడని ప్రశంసలు అందుకున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ గోపాల గౌడ వకీల్ సాబ్ సినిమాను చూసి ఓ లేఖను విడుదల చేశారు.అందులో పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు.

సాధారణంగా సినిమాలు ఒక వ్యక్తి లేదా కుటుంబం లేదా ఇతిహాసం లేదా కల్పిత కథలతో వస్తాయి.కానీ, దేవదాసు చిత్రం పవిత్ర ప్రేమను చూపించింది.

అందుకే దేశంలోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది.ఇన్నాళ్లకు వకీల్ సాబ్ రూపంలో అలాంటి చిత్రం మళ్లీ వచ్చింది అని గౌడ అన్నారు.

ఒక మధ్యతరగతి మహిళల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాటం చేసే లాయర్‌గా పవన్ నటన అత్యద్భుతంగా ఉంది.సాధారణంగా ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మాస్ ఫాలోయింగ్ ఉన్న నేటి హీరోలు చేయరు.

కానీ, పవన్ నిజ జీవితంలో మాదిరిగానే సినిమాలోనూ పోరాటం చేశారు.వకీల్ సాబ్‌లో ఆయన నటించలేదు, జీవిచారు అని చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube