ట్రంప్ టార్గెట్ గా ఒబామా సంచలన వ్యాఖ్యలు..   Ex President Obama Sensational Comments On Trump     2018-10-24   14:21:18  IST  Surya

అమెరికాలో మధ్యంతర ఎన్నికల హడావిడి మొదలయ్యింది. నవంబర్ మొదటి వారంలో జరిగే ఈ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా పిలుపుని ఇచ్చారు. అమెరికాలో రానున్న రోజుల్లో తప్పకుండా మార్పు అవసరమని అందుకు మీ ఓటు హక్కు తో నాంది పలకాలని తెలిపారు ఒబామా.. లేని పక్షంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన పర్యవసానాలు ఎదురుకాగలవని ఒబామా హెచ్చరించారు.

మార్పు కావాలని అనుకునే వారు చేయాల్సింది విమర్శలు ఒక్క ఒక్కటి కాదని ఓటుతోనే సమాధానం చెప్పాలని కోరారు..అంతేకాదు ”నా జీవిత కాలంలో నాకు గుర్తున్నంతవరకు ఈ నవంబరు ఎన్నికలు చాలా కీలకమైనవి.” అంటూ లాస్‌వెగాస్‌ లో జరిగిన రాజకీయ ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయ నేతలు ప్రతీసారి ఇలానే చెబుతూ వుంటారు, కానీ నిజంగానే ఇది చాలా ముఖ్యమైన ఎన్నిక అని ఆయన పేర్కొన్నారు.

Ex President Obama Sensational Comments On Trump-

ఈ ఎన్నికలని సాదాసీదాగా తీసుకోవద్దని ఒబామా ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు ఎక్కుపెట్టారు..

అయితే దేశం ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉండటానికి ట్రంప్ కారణమని చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు..ఇప్పుడు జరుగుతున్న ఈ ఆర్థిక అద్భుతాలన్నీ ఎవరు ప్రారంభించారో గుర్తు చేసుకోండని ఒబామా తెలిపారు…మధ్యంతర ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఒబామా వ్యాఖ్యలు ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.