జార్జ్ ని చంపిన పోలీసుకి బెయిల్..ఎంత ఖరీదో తెలుసా..??

అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణం ఓ విషాదం.అతడి మరణంతో మరో సారి అమెరికాలో జాతి వివక్ష ఎంతగా నివురు గప్పిన నిప్పులా ఉందొ బట్టబయలయింది.

 George Floyd, Black Man, Bail To Police Officer,derek Chauvin, 1.25million Dolla-TeluguStop.com

నల్ల జాతీయులపై ముందు నుంచీ అమెరికాలో దాడులు జరుగుతూనే ఉన్నా ఓ పోలీసు అధికారి బహిరంగంగా అతడిని కాలికింద పెట్టి తొక్కి చంపడం నల్ల జాతీయులు జీర్ణించుకోలేక పోతున్నారు.ఈ ఘటన తరువాత పోలీసు అధికారికి శిక్ష పడాలంటూ నిరసన చేపట్టారు నల్లజాతీయులు.

దాంతో సదరు పోలీసు అధికారిని అతడికి సహకరించిన ముగ్గురు పోలీసులని అరెస్ట్ చేశారు.

వారికి ఉరి శిక్ష వేయాలని పట్టు బడుతూ నిరసన కారులు ఇప్పటికీ నిరసనలు తెలిపుతూనే ఉన్నారు.

ఒక పక్క నిరసనలు జరుగుతూనే ఉన్నాయి.జార్జ్ ని చంపిన పోలీసు అధికారికి బెయిల్ మంజూరు అయ్యింది.

జార్జ్ మృతికి కారణమైన మినియా పోలీసు అధికారికి కోర్టు 10 లక్షల డాలర్ల షరతుతో బెయిల్ మజూరు చేసింది.అతనిపై సెకండ్ డిగ్రీ మర్డర్, ధర్డ్ డిగ్రీ మర్డర్ మ్యాన్ స్లాటర్ అభియోగాలు మోపారు.అయితే

అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచిన క్రమంలో అతడు ఆరెంజ్ కలర్ డ్రస్ లో వచ్చాడు.న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం అదురు బెదురూ లేకుండా సమాధానాలు చెప్పాడు.

అతడి తరపు న్యాయవాది బెయిల్ కి అప్ప్లై చేయడంతో షరతులతో కూడిన బెయిల్ మజూరు అయ్యింది.అతడు అమెరికా వదిలి వెళ్లరాదని, జార్జ్ కుటుంభాన్ని కలిసే ప్రయత్నాలు చేయరాదని,ఏ పోలీసు శాఖలో కూడా పనిచేయరాదని కండిషన్లు పెట్టారు.

Telugu Dollars, Black, Derek Chauvin, George Floyd-

ఇతడిని నేరానికి ప్రోత్సహించిన మరో ముగ్గురు పోలీసులను కూడా అరెస్టు చేసి జైలుకు తరలించారు.డెరెక్ కి జడ్జి… షరతులతో పది లక్షల డాలర్ల బెయిలు, బేషరతులతో 1.25 మిలియన్ డాలర్లను నిర్ధారించారు.తన ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించాలని, ఏ పోలీసు శాఖ లోనూ పని చేయరాదని, దేశం విడిచి వెళ్లరాదని, జార్జి కుటుంబంతో కాంటాక్ట్ పెట్టుకోరాదని షరతులు విధించారు.

ఈ కేసులో ఈ నెల 29 న తదుపరి విచారణ జరగాలని కోర్టు ఆదేశించింది.ఇండియన్ కరెన్సీ ప్రకారం అతడి బెయిల్ కి అయిన ఖర్చు దాదాపు 8 కోట్ల పైమాటేనట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube