చంద్రబాబు పై మాజీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు     2017-12-13   03:50:44  IST  Bhanu C

చంద్రబాబు పరిపాలన దరిద్రంగా ఉంది ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు చేస్తున్నారు అంటూ వైసీపి వాళ్ళు..మరోపక్క అవినీతి మనిషి పాదయాత్రలు చేసి ఏమి సాదిస్తావ్ అంటూ వీళ్ళు ఇలా ఒకరి తరువాత మరొకరు అధికార పార్టీ..ప్రతిపక్ష పార్టీలు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ పోతున్నారు..అయితే మధ్య మధ్యలో మేము కూడా ఏపీలో ఉన్నాం అన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు అప్పుడప్పుడు ఇరు పక్షాలని తిడుతూ ఉంటారు..ఐతే ఈ సారి మాజీ కాంగ్రెస్ ఎంపీ మాత్రం చాలా ఘాటుగానే స్పందించారు.

తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ టిడిపి అధినేత మీద తీవ్రంగా ఫైర్ అయ్యారు..నువ్వొక బడుద్దాయి ముఖ్యమంత్రి అంటూ చిందులు వేశారు.అంతేనా..చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనికి రాడు..వెంటనే భేషరతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.తిరుపతిలో మీడియా తో మాట్లాడిన చింతా ఈ వ్యాఖ్యలు చేశారు..ఇప్పుడు ఈ వ్యాఖ్యలే హాట్ టాపిక్ అయ్యాయి.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి విషయంలో డబ్బుల పంపకం..వాటాల పంపిణీలో వచ్చిన తేడాల వల్లే రాద్దాంతం జరుగుతోందని చింతా ఆరోపణ చేశారు..చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి ఉండటం వేస్ట్ అంటూ కామెంట్స్ చేశారు.

అంతేకాదు ప్రతిపక్ష నేత జగన్ పై కూడా మాటల దాడి చేశారు..అధికారం కోసం మాత్రమే జగన్ పాదయాత్రలు చస్తున్నాడు అంతే తప్ప ప్రజలపై ప్రేమా కాదు ఏమీ కాదు అంటూ ఆరోపణలు చేశారు.మొత్తం జనాభాలో రెండు శాతం మాత్రమే ఉన్న జగన్ సామాజికవర్గానికి అధికారంకావాలా అంటూ ఫైర్ అయ్యారు…కాపులకు 5 శాతం రిజర్వేషన్ కోర్టు సమీక్షలో నిలవదని జోస్యం చెప్పారు.40 సంవత్సరాలు రాజ్యాధికారాన్ని అనుభవించిన సామాజకవర్గమే మరో 40 ఏళ్ళ అధాకారం కోసం పాదయాత్ర చేస్తున్నట్లు ధ్వజమెత్తారు. రాజ్యాధికారం ఇద్దరి కులాల మద్య ఉంటే మరి అత్యధికంగా ఉన్న కులాల పరిస్థితి ఏమిటి అంటూ డిమాండ్ చేశారు..మరి చింతా మాటలకి ఇరు పార్టీలు ఎటువంటి కౌంటర్ ఇస్తాయో వేచి చూడాలి.