మాజీ ఎంపీ రాయపాటికి ట్రాన్స్ టాయ్ టెన్షన్..!

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు మరో టెన్షన్ పట్టుకుంది.రాయపాటి హామీదారుడిగా వ్యవహరిస్తోన్న ట్రాన్స్ ట్రాయ్ లిమిటెడ్ jకంపెనీ ఆస్తుల వేలానికి రంగం సిద్ధం అయింది.సెంట్రల్ బ్యాంక్‎కు సుమారు రూ.452.41 కోట్లు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ బకాయి పడింది.ఈ నేపథ్యంలో తనఖా పెట్టిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ ఆస్తులను ఆగస్టు 18న వేలం వేయనున్నట్లు సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.

 Ex Mp Rayapati, Tdp Leader, Trance Trai Company, Central Bank, Rayapati Tension-TeluguStop.com

కాగా, బిడ్స్ దాఖలుకు ఆగస్టు 14న చివరి తేదీగా సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.

కాగా, 2017 జనవరి 9వ తేదీ నాటికి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ సెంట్రల్ బ్యాంక్‎కు చెల్లించాల్సిన మొత్తం 452.41 కోట్ల రూపాయలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.వీటికి హామీదారులుగా ట్రాన్స్ ట్రాయ్ మాజీ ఎండీ శ్రీధర్, రాయపాటితో పాటు మరో ఐదుగురు వ్యక్తుులు ఉన్నారు.ఇది కాకుండా ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కెనరా బ్యాంక్‎కు సంబంధించి సుమారు రూ.300 కోట్లు మోసం చేసిన కేసులోనూ రాయపాటిపై సీబీఐ కేసు ఉంది.వివిధ బ్యాంకుల ద్వారా రూ.3,694 కోట్ల మేర రుణాలను ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ తీసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube