నాన్న కరోనా వచ్చినా దానివల్ల మృతి చెందలేదు.. కన్నీరు పెట్టించే మాజీ ఎమ్మెల్యే తనయుడి మాటలు

మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసినా కూడా ఆస్తులు కూడబెట్టుకోకుండా ఇంకా ఒక చిన్న గ్రామంలో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఇటీవల మృతి చెందిన విషయం తెల్సిందే.ఆయన కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయిన కొన్ని గంటల్లోనే మృతి చెందడంపై పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

 Ex Mla Sunnam Rajaiah Son Emotional Comments On Father Death, Sunnam Rajaiah Cov-TeluguStop.com

ఇలాంటి సమయంలో సున్నం రాజయ్య తనయుడు సున్నం సీతరామరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.స్థానికులు ఆయనపై చూసిన చూపు కారణంగానే ఆయన మృతి చెందినట్లుగా పేర్కొన్నాడు.

తన తండ్రి మృతికి సంబంధించి ఒక ఆడియో టేప్‌ ను విడుదల చేసిన సీతరామరాజు కరోనా కంటే ఆయన్ను జనాల చిత్కారాలు బలితీసుకున్నాయన్నాడు.ఎప్పుడు జనాల్లో ఉండే నాన్నను మా అక్కకు కరోనా వచ్చిందనే ఉద్దేశ్యంతో ఆయన్ను దూరంగా పెట్టడం మొదలు పెట్టారు.

ఆయనకు కరోనా లేకున్నా కూడా జనాలు ఆయన్ను దూరం పెట్టడంతో ఆయన మానసికంగా కృంగి పోయాడు.ఆయన వస్తుంటే తలుపులు వేసుకోవడం ఆయనకు ఆమడ దూరంలోనే ఉంటూ మాట్లాడటం వంటివి చేయడంతో ఆయన బాధ పడ్డాడు.

ఆ సమయంలోనే ఆయనకు కూడా కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది.ఆయన్ను జనాలు మరింతగా దూరం పెట్టారు.దాంతో ఆ విషయాన్ని తట్టుకోలేక నాన్న తీవ్ర ఒత్తిడితో ఊపిరి ఆడక మృతి చెందినట్లుగా ఆయన పేర్కొన్నాడు.జనాలు తన పట్ల చూపించిన వ్యతిరేకత కారణంగానే నాన్న చనిపోయాడు.

ఎన్నో జబ్బులు ప్రమాదాలు ఎదుర్కొన్న ఆయనకు కరోనా పెద్ద లెక్క కాదు అంటూ సీతారామరాజు అన్నారు.ఈ మాటలు రాజయ్య అభిమానులకు కన్నీరు తెప్పిస్తున్నాయి.

జీవితాంతం తమ కోసం పోరాటం చేసిన ఆయన్ను చివరి రోజుల్లో అలా చూడటం బాధగా ఉందంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube