తాజాగా మూడు రోజుల నుంచి విజయవాడలో ప్రముఖ దేవస్థానం కనకదుర్గ ఆలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు.ప్రసాదాల కౌంటర్ల నుంచి చెప్పుల స్టాండుల కాంట్రాక్టుల వరకు అనేక రూపాల్లో ఇక్కడ అవినీతి పెచ్చరిల్లిపోయిందనే.
ఫిర్యాదుల నేపథ్యంలో వరుసగా మూడు రోజులుగా ఏసీబీ అధికారులు ఇక్కడ తనిఖీలు చేస్తున్నారు.వాస్తవానికి ఈ రేంజ్‌లో మూడు రోజులుగా .దాడులు చేయడం ఆలయ చరిత్రలో ఇదే ప్రథమం అంటున్నారు పరిశీలకులు.అయితే.
ఇక్కడ అధికారుల పాత్ర కన్నా.కూడా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేరు ఎక్కువగా వినిపిస్తుండడం గమనార్హం.
ఇదే నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు.పైగా గుడికి సమీపంలోనే ఆయన నివాసం కూడా ఉంది.ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం నాయకులు వెలంపల్లిని టార్గెట్ చేసుకున్నారు.తాజాగా మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మంత్రి వెలంపల్లిని ఉతికి ఆరేశారు.
ఆయన అవినీతికి మారుపేరుగా ఉన్నారని.అన్ని విషయాల్లోనూ కలెక్షన్ కింగ్‌గా ఉన్నారని ఆరోపించారు.
మంత్రి అవినీతికి సంబంధించి తాను అమ్మవారి గుడికి వచ్చి ప్రమాణం చేస్తానని.కూడా సవాల్ విసిరారు.
దీంతో ఒక్కసారిగా ఏసీబీ దాడుల వ్యవహారం.మంత్రి వైపు తిరిగింది.
దుర్గగుడికి సంబంధించిన రథానికి ఉన్న వెండి సింహాలు మాయం కావడం తెలిసిందే.దీనివెనుకూడా మంత్రి పాత్ర ఉందని అప్పట్లో జనసేన సహా బీజేపీలు కూడా ఆరోపించాయి.ఇప్పుడు ఏకంగా ఏసీబీ దాడులు జరుగుతున్నాయి.మంత్రిగారి అనుచరులు ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారని.
అన్ని విషయాల్లోనూ ఆయన అనుచరుల పాత్రుందని.అమ్మవారికి భక్తులు సమర్పించే చీరల నుంచి అన్ని స్థాయిల్లోనూ అక్రమాలు జరిగాయని.
అంటున్నారు.అయితే.
ఇన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నా.మంత్రి మాత్రం మౌనంగా ఉండడం గమనార్హం.
మరి దీనిపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.