మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి మృతి! షాక్ లో జగన్!  

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి మృతి..

  • వైసిపి అధినేత జగన్ బాబాయ్, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైయస్ వివేకానంద రెడ్డి తాజాగా గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈరోజు నుంచి వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాలని జగన్ భావించారు. అయితే ఊహించని విధంగా ఆయన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి ఆయన ఇంట్లో గుండెపోటుతో మార్నింగ్ చనిపోయారని వార్త రావడంతో హుటాహుటిన అక్కడికి బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది.

  • ఇంట్లో ఈరోజు తెల్లవారుజామున బాత్రూం కి వెళ్లే సమయంలో తీవ్ర గుండెనొప్పి రావడంతో కాలుజారి బాత్రూంలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఇక సంఘటన స్థలంలోనే ఆయన ప్రాణం వదిలినట్టు సమాచారం. ఇక బాబాయ్ మృతితో జగన్ ఈరోజు తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని వాయిదా వేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.