మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మృతి

మాజీ మంత్రి, వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు పెన్మత్స సాంబశివరాజు (88) మరణించారు.గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం కన్నుమూసారు.

 Ex Minister Penmatma Sambashivaraju Died,vijayanagaram, Ex Minister, Sambashiv-TeluguStop.com

అనారోగ్య సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేయించారు.అప్పటి నుంచి ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించుకుంటున్నారు.

కాగా, తెల్లవారుజామున ఆరోగ్య పరిస్థితి మరీ క్షీణించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.దీంతో కుటుంబసభ్యులు శోకసంధ్రంలో మునిగారు.

మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరావు మరణవార్త విని అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అందించారు.

కాగా, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు ఉమ్మడి రాష్ట్రంలో ఏకంగా ఎనిమిది సార్లు శాసనసభ సభ్యుడిగా (ఎమ్మెల్యే) బాధ్యతలు చేపట్టిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందాడు.రాజకీయ రంగంలో ఈయన రాజకీయ కురువృద్ధుడిగా ఖ్యాతి గడించారు.1958లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.1968లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై గజపతినగరం, సతివాడ శాసనసభ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించాడు.1989 నుంచి 1994లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.మంత్రి బొత్సకు రాజకీయ గురువుగా కొనసాగారు.

మంత్రి మరణంతో ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube